Prakash Raj targets Yogi over Tipu Jayanti remarks యోగీని టార్గెట్ చేసిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్

Prakash raj targets yogi adityanath over tipu jayanti remarks

Karnataka Assembly Elections 2018, Karnataka Assembly polls, lord hanuman, Narendra Modi, Siddaramaiah, Tipu Sultan, prakash raj, Yogi Adityanath, Karnataka news, india news, social news, latest news

The noted actor Prakash Raj has taken objection to the statements of Adityanath with a set of photos showing BJP functionaries and BS Yeddyurappa himself celebrating Tipu Jayanti, complete with the headgear Tipu was noted to wear.

యోగీని టార్గెట్ చేసిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్

Posted: 12/22/2017 06:01 PM IST
Prakash raj targets yogi adityanath over tipu jayanti remarks

హనుమంతుడి భూమిగా ప్రసిద్ది చెందిన కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వేడుకలను నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి సమంజమేనా..? అన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ప్రశ్నలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను అయన కన్న ఉన్నత్తమైన, ఉత్తమమైన హిందువునని, బీజేపి పార్టీలో హిందువులు మాత్రమే వున్నారా,; అంటే అదే స్థాయిలో బదులిచ్చిన విషయం తెలిసిందే.  

రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టిప్పుసుల్తాన్ ను హనుమంతుడు ఓడిస్తాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, సీఎం యోగీ సంధించిన ప్రశ్నలపై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. యోగి పేరిట ఓ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అన్నదమ్ముల మాదిరిగా వున్న కన్నడీగుల మధ్య విద్వేషాలు, మత సామరస్యాన్ని విచ్చిన్నం చేసే విధంగా కొత్తగా విత్తనాలను ఎందుకు నాటుతున్నారని ప్రశ్నించారు. ఈ విధమైన భావజాలాన్ని పెంచడమెందుకని ప్రశ్నించారు.

అయితే తన లేఖతో పాటు పలు ఫోటోలను కూడా జత చేసిన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను ఓ సారి జాగ్రత్తగా పరిశీలించాలని కూడా ఆయన యోగికి సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ శతజయంతి ఉత్సవాలను రాద్దంతాం చేసిన బీజేపి నేతలు.. అదే వారి అధికార హాయంలో మాత్రం అదే టిప్పు సుల్లాన్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

అప్పుడు రాష్ట్ర బీజేపి అగ్రనేతలు సంతోషంగా పాల్గోన్నారు. అప్పుడు వేదికపై సంతోషంగా కనిపించిన నేతలు ఇప్పుడు మీలో ఎందుకు కనిపించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. మీ పార్టీ నేతలు, కార్యకర్తలు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో ఎంజాయ్ చేస్తే లేని సమస్య ఇప్పుడెందుకు ఉత్పన్నమైందో చెప్పాలని నిలదీశారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మత పరంగా జనాలను రెచ్చగొట్టడం తప్ప మీకు ప్రజల సమస్యలు పట్టడం లేదా? అని అడిగారు.

 Yogi ji orders people of Karnataka “don’t celebrate tippu sultan in the land of hanuman” dear sir.. what’s your agenda again...#justasking pic.twitter.com/wwfErkW09e

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles