man handling case booked against former union ministers son పబ్ లో పంబరేపిన కేంద్ర మాజీ మంత్రి కొడుకు..

Police issues notices to former union ministers son in man handling case

former union minister, balaram nayak, sai nayak, kalyan, celebrities, pub, pub culture, jubiliee hills, hyderabad police, telangana, crime

hyderabad jubilee hills police issues notices to attend in front of them to former union mininster son sai nayak for manhandling a jubilee hills guy in pub.

పబ్ లో పంబరేపిన కేంద్ర మాజీ మంత్రి కొడుకు.. కేసు నమోదు

Posted: 12/22/2017 09:22 AM IST
Police issues notices to former union ministers son in man handling case

సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలు అచ్చంగా సినిమాల్లో చూపించినట్లుగానే వ్యవహరిస్తారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. తమను తాము హీరోల రోల్ లో ఊహించుకునే సెలబ్రిటీల పిల్లలు చేసేది మాత్రం విలన్ చేష్టలంటే చిత్రంగా లేదు. కానీ ముమ్మాటికీ అదే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే అసలేం జరిగిందన్న దానిపై సిసిటీవీ ఫూటేజీని పరిశీలించిన తరువాత నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని అదేశాలిస్తున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో చోటుచేసుకుందీ ఘటన. కేంద్రమాజీ మంత్రి కుమారుడు స్థానికంగా గల ఓ పబ్ లో ఎంజాయ్ చేశాడు. ఇక కొద్ది సేపట్లో బయటకు వెళ్తున్నాననగా, హల్‌చల్ చేశాడు. పబ్‌కు వచ్చిన ఓ యువకుడి చేయి పొరపాటున అతడికి తాకడంతో మంత్రి కుమారుడు సాయి నాయక్ వెర్రెత్తిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ అతడిని దుర్బాషలాడాడు. అంతటితో ఆగక చేయి చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన దర్యాప్లును పోలీసులు  ఆలస్యంగా చేపట్టడంతో తాజాగా వెలుగు చూసింది.

జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని ఓ పబ్ కు అదే ప్రాంతానికి చెందిన కల్యాణ్ తన స్నేహితులతో వెళ్లాడు. తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున అతడి చేయి మాజీ మంత్రి కుమారుడు సాయి నాయక్ కు తగిలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కల్యాణ్ పై దాడికి దిగాడు. దీంతో బాధితుడు నేరుగా వెళ్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సాయి నాయక్ ను విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles