UN votes resoundingly to reject Jerusalem as capital ట్రంప్ కు ఐక్యరాజ్యసమితిలో దిమ్మదిరిగే షాక్..!

Un votes resoundingly to reject trump s recognition of jerusalem as capital

United Nations, Israel, Donald Trump, United states, jerusalem, european cpountries, austraila, canada, colombia, mexico, palestina, Nikki Haley, the US ambassador to the UN, World news, Middle East and North Africa, US news

The United Nations body’s debate and vote highlighted for a second time in a week the international isolation of the United States over the Jerusalem issue

అగ్రరాజ్యానికి ఐక్యరాజ్యసమితిలో దిమ్మదిరిగే షాక్..!

Posted: 12/22/2017 09:55 AM IST
Un votes resoundingly to reject trump s recognition of jerusalem as capital

అగ్రరాజ్యం అమెరికాకు ఐక్యరాజ్య సమితిలో షాక్ తగిలింది. తామెన్ని హెచ్చరికలు చేసినా.. ప్రపంచ దేశాలు వాటిని లక్ష్యపెట్టలేదు సరికదా.. ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. పెద్దన్న తరహాలో వున్న అమెరికా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానివేసి.. అందరి పక్షన అలోచించి.. యోచించి నిర్ణయాలు తీసుకోవాలనే దిశగా ప్రపంచ దేశాలు తమ ఓటింగ్ ద్వారా అమెరికాకు సూచించాయి. ఇజ్రాయిల్ రాజధానిగా జరూసలేంను పరిగణిస్తున్నట్టు అమెరికా నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని తేల్చిచెప్పాయి.

అయితే అసలే పెద్దన్న.. అందులోనూ తమ దేశం నుంచి అనేక నిధులను పొందుతూ అభివృద్ది దిశగా పయనిస్తున్న దేశాలు.. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని జీర్ణంచుకోలేని అగ్రరాజ్యం ఐక్యరాజ్యసమితి సాక్షిగానే హెచ్చరికలు జారీ చేసింది. జరూసలేం రాజధానిగా పరిగణించే తమ నిర్ణయాన్ని వ్యతిరేకించిన చిన్న దేశాలపై ఇప్పటికే పలుమార్లు అగ్రహాన్ని వ్యక్తం చేసిన అమెరికా.. ఇక తాజా ఓటింగ్ తరువాత ఈ ఫలితాలను అమెరికా గుర్తుపెట్టుకుంటుందని కూడా తేల్చిచెప్పింది.

ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతిపాదించిన నిర్ణయానికి అనుకూలంగా కేవలం అగ్రరాజ్యం, ఇజ్రాయిల్ సహా 9 దేశాలు మాత్రమే జరూసలేం రాజధానిగా ఉండాలని కోరుకోగా, ఏకంగా 128 దేశాలు తాము వ్యతిరేకమని స్పష్టం చేశాయి. మరో 35 దేశాలు తటస్థంగా ఉండగా, 21 దేశాలు ఓటింగుకు గైర్హాజరు అయ్యాయి. దీంతో ఓటింగ్ అనంతరం ఐక్యరాజ్య సమితిలో యూఎస్ ప్రతినిధి నిక్కీ హేలీ మాట్లాడుతూ, "ఈ రోజును అమెరికా గుర్తు పెట్టుకుంటుందని వార్నింగ్ తరహాలో వ్యాఖ్యలు చేశారు.

ఓ స్వతంత్ర దేశంగా మా సార్వభౌమత్వానికి ఈ సమావేశం అడ్డు తగిలింది. దీన్ని గుర్తు పెట్టుకుంటాం. ఐరాసకు అత్యధికంగా నిధులు ఇస్తున్నది మేమేనని మరువకండి. మాకు వ్యతిరేకంగా ఓటేసిన ఎన్నో దేశాలు, తమ తమ ప్రయోజనాల కోసం అమెరికాను వాడుకున్నవే" అని అన్నారు. వ్యతిరేక దేశాలకు ఇస్తున్న నిధులను, రాయితీలను పునఃపరిశీలిస్తామని ఆమె అన్నారు. ఏదిఏమైనా ఇజ్రాయిల్ లోని తమ ఎంబసీని జెరూసలేంకు మార్చేది ఖాయమని తేల్చి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : United Nations  Israel  Donald Trump  United states  jerusalem  Nikki Haley  capital  

Other Articles