Brisk polling underway in RKNagar by-poll మందకోడిగా అర్కేనగర్ పోలింగ్.. కేవలం 24 శాతమే..

Rk nagar by elections votings underway 24 voter turnout till 12 30 am

rk nagar election, rk nagar election live, rk nagar election result, rk nagar polls, rk nagar polling percentage, rk nagar pollings news, rk nagar polls today, rk nagar, by-election, brisk polling, election result, dmk, aiadmk, ttv dinakaran, jayalalithaa, chennai, tamil nadu, politics

Polling in the Dr. Radhakrishnan Nagar (RK Nagar) Assembly constituency in north Chennai began at 8am on brisky way, The voters turn out till 12.30 at only 24 percent.

మందకోడిగా అర్కేనగర్ పోలింగ్.. కేవలం 24 శాతమే..

Posted: 12/21/2017 01:30 PM IST
Rk nagar by elections votings underway 24 voter turnout till 12 30 am

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన అర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఇవాల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 258 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగుతుంది. అయితే బరిలో నిలిచిన అభ్యర్థులకు, వారి అనుచరులకు ఉన్నంత ఉత్సాహం మాత్రం ఓటర్ల నుంచి రావడం లేదు.

అందుకు కారణం మందకొడిగా సాగుతున్న పోలింగ్. ఉదయం ఎనమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ రెండు గంటల తరువాత పది గంటల వరకు కేవలం 11 శాతమే నమోదు అయ్యింది. కాగా ఆ తరువాత 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మరో 14 శాతంగానే నమోదయ్యింది. ఉపఎన్నికలను ప్రకటించిన గత ఏప్రిల్ లో రద్దు చేయడం, అమ్మ పేరును పార్టీలు దుర్వినియోగం చేస్తున్నారన్న భావనతో మరికొందరు ఓటర్లు ఉప ఎన్నికలపై అసక్తిని కనబర్చడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆరు నెలల్లోగా ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలై నామినేషన్లు కూడా పూర్తైన తరువాత అక్రమాలు జరుగుతున్నాయన్న అభియోగాలపై ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్‌ సహా మొత్తం 59 మంది రంగంలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్‌ పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది.

మొత్తంగా 2 లక్షల 28 వేల 234 మంది ఓటర్లు ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరి కోసం ఎన్నికల అధికారులు 256 పోలిగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల అధికారులు మొత్తంగా 2000 మంది పోలీసుల బలగాలతో పాటు 15 కంపెనీలు సెంట్రల్ అర్మ్ పోలీసు బలగాలను మోహరించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట ముందస్తు చర్యలు తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rk nagar  by-election  brisk polling  election result  dmk  aiadmk  ttv dinakaran  j.jayalalithaa  chennai  tamil nadu  

Other Articles