Dinakaran Faction Released Jayalalithaa Apollo Visuals | సంచలనం.. అపోలోలో అమ్మ.. చివరి రోజుల్లో వీడియో విడుదల

Jayalalithaa apollo video released

Jayalaithaa, Apollo Hospital, Treatment Visuals, Dinakaran Faction, MLA Vetrivel, RK Nagar By Election, Jayalalithaa Apollo Visuals, Amma in Apollo Hospital, Palani Swamy Jayalalithaa Visuals,

Amid RK Nagar By Election Dinakaran Faction released Jayalalithaa's Treatment Video. Jayalalithaa on bed drink some juice on that video released by Vetrivel.

సంచలనం : అమ్మ వీడియో.. ఈసీ సీరియస్

Posted: 12/20/2017 11:01 AM IST
Jayalalithaa apollo video released

అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందిన వీడియోలు ఎట్టకేలకు బయటకు వచ్చాయి. దినకరన్ వర్గం ఈ ఉదయం ఆ వీడియోలను బహిర్గతం చేసేసింది.

ఆఖరి రోజుల్లో ఆమె ఎలా ఉంది? ఆమె చుట్టూ ఉన్న మనుషులెవరూ? తదితర దృశ్యాలు అందులో ఉన్నాయి. దినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ ఫుటేజీని విడుదల చేశారు. జ్యూస్ తాగుతూ బెడ్ మీద ఉన్న జయలలితను అందులో చూడొచ్చు. జయ మృతి చెందిన ఏడాది తర్వాతి విజువల్స్ విడుదల కాగా, రేపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉన్న సందర్భంగా ఇది ఏ మేర ప్రభావం చూపుతుందన్నది అనుమానమే.

ఆ వీడియో మార్ఫింగ్ : అన్నాడీఎంకే

జయను శశికళే చంపిందన్న ఆరోపణలను ఖండించటంతోపాటు.. ఆమెకు మెరుగైన చికిత్స అందించామని తెలియజేసే క్రమంలో ఈ వీడియోను దినకరన్ వ్యూహాత్మకంగా బయటపెట్టినట్లు అర్థమౌతోంది. తద్వారా ఓటర్ల నుంచి సానుకూలత పొందే యత్నం చేస్తున్నాడు. అయితే ఈ వీడియోపై ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గీయులు మండిపడుతున్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని, వీడియోలో ఉన్నది జయలలిత కాదని, ఇది మార్ఫింగ్ వీడియో అని ఆరోపించారు.

జయలలిత మరణించిన తర్వాత కానీ, ఈ ఏడాది కాలంగా కానీ బయటపెట్టని వీడియోను, ఇప్పుడు ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉన్న జయను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదని... చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు కూడా ఆమెను చూపించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. 

ఈసీ సీరియస్...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తీసిన వీడియో బయటకు రావడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సరిగ్గా ఒక రోజు ముందు వీడియో విడుదల కావడంపై కన్నెర్ర చేసింది. ఏ ఉద్దేశంతో ఈ వీడియోను విడుదల చేశారంటూ ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలంటూ తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles