mudragada twist on kapu reservations కాపు రిజర్వేషన్లపై ముద్రగడ ట్విస్టు..

Mudragada padmanabham presurises government on kapu reservations

kapu caste leader, mudragada padmanabham, andhra pradesh government, chandrababu, new year celebrations, sankranti, ugadi, festivals, republic day

Kapu caste leader and former minister mudragada padmanabham presurises government on kapu reservation in a different mode of protest.

కాపు రిజర్వేషన్లపై ముద్రగడ ట్విస్టు..

Posted: 12/20/2017 10:39 AM IST
Mudragada padmanabham presurises government on kapu reservations

కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఇప్పటికే పలు ఉద్యమాలను రచించి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులు పెట్టిన కాపు సామాజిక వర్గ హక్కుల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మాణం చేసి దానిని కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. కేంద్రం ఈ తీర్మాణాన్ని ఉభయ సభల్లో ప్రేవేశపెట్టి అమోదించిన వెంటనే కాపులను బీసి జాబితాలో చేర్చడం చకచకా జరిగిపోతుంది.

అయితే ఇందకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఎనమిది నెలల గడువును విధిస్తూ.. ఈ లోపుగా కాపులను బిసీలలో చేర్చాలని తీర్మాణాన్ని కేంద్రానికి పంపింది. అయితే కాపులను బిసి జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను హర్సించిన ముద్రగడ.. అయనను నమ్ముదామని పిలుపునివ్వడం గమనార్హం. కాగా, కాపులతో పాటు బలిజ, తెలగ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్ ఫలాలు అందే వరకూ ఏ పండగ చేసుకోనని గతంలో చెప్పిన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని ఆయన మరోమారు గుర్తు చేశారు.

తమ సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చేవరకు 2018 కొత్త సంవత్సర వేడుకలతో పాటు ఏ పండుగలను చేసుకోనని ఇదివరకే చెప్పిన ఆయన మరోమారు గుర్తు చేశారు. తమ సామాజిక వర్గాలు ఆశించిన మేరకు రిజర్వేషన్లు పొందడమే అసలైన పండగగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆ అసలైన పండగ కోసం..ఆరోజు కోసమే తాను కూడా నిరీక్షిస్తున్నానని తెలిపారు. జనవరి 1న తనను కలిసేందుకు, శుభాకాంక్షలు చెప్పేందుకు కిర్లంపూడికి వచ్చే ప్రయత్నం చేయవద్దని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు విజ్ఞప్తి చేస్తున్నానని తన ప్రకటనలో ముద్రగడ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles