Smriti Irani Said GST Created Job Boom For CAs కేంద్రమంత్రి స్మృతిఇరానీపై నెట్ జనుల వ్యంగాస్త్రాలు..

Smriti irani said gst created job boom for cas

smriti irani, gst, goods and serivices tax, party trumpet, chartered accountant, twitter, social media, troll, gujarat, chief minister

Union Minister Smriti Irani decided to blow the party’s trumpet yet again. She shared a news article that proclaimed that the GST had created a job boom for Chartered Accountants.

కేంద్రమంత్రి స్మృతిఇరానీపై నెట్ జనుల వ్యంగాస్త్రాలు..

Posted: 12/19/2017 07:52 PM IST
Smriti irani said gst created job boom for cas

గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో తన పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తుందని తెలిసిందో ఏమో తెలియదు కానీ.. మరింత ముందుకు వచ్చేందుకు తనకు తెలిసిన ప్రయత్నాలు చేసిన కేంద్రమంత్రి నెట్ జనుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. జీఎస్టీ మూలంగా  అకౌంటెంట్స్ ఉద్యోగాలకు యమ డిమాండ్ పెరిగినట్లు ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్‌’ వెల్లడించిందంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్ పై వరుసగా వ్యంగ్య ట్వీట్లు పేలుతున్నాయి.

కేంద్రమంత్రి ట్విట్ ను విమర్శిస్తూ నెట్ జనులు తమదైన శైలిలో విమర్శలు సందిస్తున్నారు. పెనుభూకంపం వస్తే పలు భవనాలు కూలిపోతాయని, అప్పుడు భవన నిర్మాణ రంగంలో భారీగా ఉద్యోగాలు పెరుగుతాయని అన్నట్లు ఉందని కొందరు వ్యంగంగా వ్యాఖ్యానించారు. ఇరానీ పేరును ట్యాగ్‌ చేస్తూ ఇదేమి ఐరనిరా బాబూ! అంటూ కొందరు, డెంగ్యూ రావడం వల్ల ప్రైవేట్ ఆస్పత్రులకు డిమాండ్ పెరిగిందన్నట్లు ఉందని మరికొందరు వ్యంగ్యోక్తులు విసిరారు.

టెర్రరిస్టులు ప్రజలను చంపడం వల్ల శ్మశానంలో కార్మికుల సంఖ్య పెరుగుతుందని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ప్రమాదాల వల్ల ఆస్పత్రుల వ్యాపారం పెరుగుతుందని, అగ్నిమాపక ప్రమాదాలు జరగడం వల్ల అగ్నిమాపక దళాలకు డిమాండ్‌ పెరుగుతుందని, వరదల వల్ల ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో ఉద్యోగాలు పెరుగుతాయని సంబురపడినట్లు ఉందని కొందరు నెట్ జనులు అమెను తూర్పారబట్టారు. ‘దయచేసి మీరు రాజీనామా చేయండి. మీ వల్ల కేంద్ర కేబినెట్ లో ఓ ఉద్యోగి పెరుగుతారంటూ మరొకరు మరింత ఘాటుగా స్పందించారు.

దేశంలో నకిలీ డిగ్రీలు బీజేపీకీ ఉద్యోగాల ఊపును తీసుకొచ్చిందని ఒకరు వ్యాఖ్యానించారు. స్మృతి ఇరానీపై నకిలీ డిగ్రీ వివాదం ఉన్న విషయం తెల్సిందే. జీఎస్టీ వల్ల సీఏ ఉద్యోగాలు పెరిగాయన్న విషయాన్ని యేల్‌ యూనివర్శిటీలో నేర్చుకున్నారా? అంటూ మరొకరు ప్రశ్నించారు. ఆ యూనివర్శిటీలో ఆమె ఆరు రోజుల డిగ్రీ చదివినట్లు వార్తలొచ్చిన విషయం తెల్సిందే. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో మీ పార్టీ నేతల మొప్పు పొందవచ్చు కానీ దేశ ప్రజలది కాదని, మరికొందరు సూచించారు. ఈ ఒక్క ట్విట్ అమెకు ముఖ్యమంత్రి పదవిని దరి చేరుస్తుందా..? లేక దూరం చేస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smriti irani  gst  chartered accountant  jobs  twitter  social media  troll  gujarat  

Other Articles