Bjp mlc somuveerraju slams ally tdp on decieving మోడీ హయాంలో.. టీడీపీ మోసాలు చెల్లవ్

Bjp mlc somuveerraju slams ally tdp on decieving

Somu Veerraju slams tdp, Somu Veerraju slams ally, Somu Veerraju narendra modi, Somu Veerraju vajpayee, Somu Veerraju special status, Somu Veerraju steel plant, Andhra Pradesh, 2019 Elections, BJP, MLC Somu Veerraju, MLC Rajendra Prasad, TDP MLC Rajendra Prasad, Gujarat Himahal Poll Results

Bjp mlc somuveerraju slams ally tdp on decieving bjp and its activists, says tdp agrees for packages and again when bjp goes for milage tdp leaders raise special status, steel factory slogans.

మోడీ హయాంలో.. టీడీపీ మోసాలు చెల్లవ్

Posted: 12/19/2017 04:28 PM IST
Bjp mlc somuveerraju slams ally tdp on decieving

గుజరాత్ ఎన్నికలలో 8 శాతం మెజారిటీ ఓట్లతో తాము అధికారంలోకి చ్చామని, అదే ఏపీలో పవన్ కల్యాన్, బీజేపి కలిసిన తరువాత కూడా కేవలం రెండు శాతం ఓట్లతోటే అధికారంలోకి వచ్చామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మిత్రపక్షాల మధ్య రేగిన విబేధాలు ఆ తరువాత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ బీజేపికి కౌంటర్ వ్యాఖ్యలు చేయడంతో మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మీడియా ముందుకు వచ్చిన సోము విర్రాజు.. టీడీపీతో పొత్తును బీజేపీ ఎంతో గౌరవించిందని అయితే టీడీపీ మాత్రం బీజేపిని మోసం చేస్తూనే వుందని అన్నారు.

అటల్ బిహారీ వాజ్ పేయి, నరేంద్ర మోదీలు ప్రధానులుగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంతో ఆదరించారని తెలిపారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వాజ్ పాయ్ లాంటి నేత మంచానికే పరిమితం అయ్యారని అవేదన వ్యక్తం చేశారు. మిత్రంపక్షంగా అదరించి.. అందలం ఎక్కించిన ప్రతీసారి తమను ఐస్ క్రీం పుల్లలమంటూ తీసిపారేయడం సబబు కాదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిత్రపక్షమైన తాము తమ పార్టీ కార్యకర్తలకు ఏమీ చేయలేని స్థితిలో తాము ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్లు, పెన్షన్లు ఇలా ఏవీ ఇప్పించుకోలేకపోతున్నామని వాపోయారు. కార్యకర్తలకు ముఖం చూపించలేని పరిస్థితి ఉందని చెప్పారు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఏపీలో ఇప్పటికే బీజేపీ ఎంతో బలం పుంజుకుందని.... వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే దిశగా, పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని వీర్రాజు అన్నారు. పొత్తు లేకుండానే గెలిచే సత్తా తమకు ఉందని తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది నేతలు బీజేపీలో చేరారని, మరింత మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

కేంద్రం నిధులు ఇచ్చిందని, అంగీకరిస్తారు.. మా పార్టీ నేతలు ప్రచారం చేసుకునేందుకు వెళ్లగానే టీడీపీ నేతలు తమకు దానిని అందకుండా ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు కుటిలయత్నాలు చేస్తున్నారని అన్నారు. కేంద్రం చేసిన సాయాన్ని నాలుగు గోడల మధ్య అంగీకరిస్తున్న చంద్రబాబు.. నలుగురిలో మాత్రం ఆ మేరకు తాము బలోపేతం కాకుండా చేస్తున్నారని అన్నారు. బీజేపి ప్రజల్లోకి వెళ్తుందన్న ప్రతీసారి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంటు అంశాలను తెరపైకి తీసుకోస్తున్నారని సోము వీర్రాజు అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : somu veerraju  rajendra pradsad  special status  TDP  BJP  Ally  Andhra pradesh  Politics  

Other Articles