police conducts medical test to Rajesh after arrest సుధాకర్ హత్యస్థలానికి రాజేష్.. వాడిని చంపేయండీ..

Police conducts medical test to rajesh after arrest

Sudhakar Reddy, Rajesh, Mahbubnagar, medical tests, set ablaze, Lakshmi Narayana, Apollo Hospitals, murder, arrest, nagar kurnool, telangana, crime

police conducts medical test to swathi lover Rajesh after arrest, and they took him to the spot for scene reconstruction where sudhakar reddy body was set ablaze.

సుధాకర్ హత్యస్థలానికి రాజేష్.. వాడిని చంపేయండీ..

Posted: 12/15/2017 11:32 AM IST
Police conducts medical test to rajesh after arrest

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో అతని భార్య స్వాతిని ఇటీవలే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముఖానికి గాయాలు కావడంతో క్రితం రోజులన అమె ప్రియుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ ను అదుపులోకి తీసుకున్న తరువాత అతడిని వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే రాజేష్ గాయాలు పూర్తిగా తగ్గిపోతున్నాయిని, ఎడమ కాలి గాయం మాత్రమే మరీ తొలుగా వుందని, అది తగ్గేందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

అయితే రాజేష్ ను అరెస్టు చేసిన తరువాత ఆసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితిలో గాయలు లేవని అన్నారు. అయితే డ్రెస్సింగ్ కోసం మాత్రం తీసుకువెళ్లాల్సిన అవసరంవుంటుందని చెప్పారు. పోలీసులు.. సుధాకర్ రెడ్డిని ఎలా హతమార్చింది.. ఎక్కడ దహనం చేసారన్న వివరాలను తెలుసుకుని ఘటనాస్థలానికి తీసుకెళ్లి పరీశీలించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న పోలీసులు.. ఆయన హత్యకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి చార్జీషీటులో పొందుపర్చేందుకు సిద్దమవుతున్నారు.

సుధాకర్ రెడ్డిని హత్య చేసిన తరువాత కారులోకి ఆయన శవాన్ని ఎలా పెట్టారు. ఘటనాస్థలంలో ఎలా దించారు. పెట్రోల్ ఎక్కడ కొన్నారు.. అన్న పూర్తి వివరాలను తెలుసుకన్నారు. ఘటనాస్థలంలో సీన్ పూర్తిగా మరోమారు చేయించి వివరాలను తెలుసుకున్నారు. భర్తతో సంసార జీవనంలో వున్న హాయి ఏ పర వ్యక్తితో ఎలాంటి అనుబంధాలను పెట్టుకున్నా అవి నిలవవని ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పలు వ్యవహరాలు బయటపెట్టినా.. అదే దారిలో వెళ్లి.., అత్యంత దారుణంగా మర్డర్ స్కెచ్ వేయడం తెలుగురాష్ట్రాల్లోనే కలకలం రేపింది.

గత నెల 27 తెల్లవారుజామున సుధాకర్‌రెడ్డికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి తలపై మోదీ హతమార్చి.. అతని కారులోనే మహబూబ్ నగర్ కు సమీపంలోని ఫతేపూర్ మైసమ్మ ఆలయ సమీంపలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి కాల్చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న స్వాతి, రాజేష్ లను కఠినంగా శిక్షించాలని, వాళ్లకి భూమ్మీద బతికే అర్హతలేదని రాజేష్ తల్లి అంటున్నారు. ‘ఒక మనిషిని కిరాతంగా హత్యచేసిన వాడు తనకు పట్టనేలేదని భావిస్తానని అమె తన అక్రోశాన్ని వెల్లగక్కారు.

రాజేష్, స్వాతీలను కఠినంగా శిక్షించండి. చంపేయండి. లేదంటే తనకు అప్పగించినా తానే చంపేస్తానని పేర్కొనింది. భార్యభర్తల మధ్య ఎన్నో అనుబంధాలు వుంటాయి.. వాటిని పర పురుషులతో తీర్చుకోవాలని భావించడం ఎంతవరకు సమంజసమని అమె ప్రశ్నించారు. స్వాతి, రాజేష్ లను ఎంత దారుణంగా హింసించి చంపాలంటే.. ఇలాంటి ఘటనలకు మరోకరు పాల్పడాలన్న అలోచనలు కూడా రాకూండా చేయాలని అమె తన అవేదనను వ్యక్తం చేశారు.

తాను చిన్ననాటి నుంచి రాజేష్ ను ఎంతో మంచిగా పెంచానన్నారు. కష్టపడి చదివించాను. ఇప్పుడు తనకు చేదోడు వాదోడుగా వుండి.. పుత్రోత్సాహం కలిగిస్తాడని భావించాను. అయితే తనకు అపఖ్యాతిని తెచ్చిపెట్టాడని, ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చినవాడు తనకు బిడ్డ కానేకాదని అమె కన్నీళ్ల పర్యంతమయ్యారు. వాడు భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వాడిని ఎంత త్వరగా చంపేస్తే తనకు మనసు అంత మనశ్శాంతి కలుగుతుందని అన్నారు.

జులైలో రాజేష్ తండ్రి పరమపదించారని, అప్పటి నుంచే వాడు చెడు తిరుగుళ్లు మొదలుపెట్టాడు. స్వాతి, రాజేష్ విషయం తనకు కొన్నిరోజుల ముందు తెలుసున్నా వాడికి తగిన శిక్ష వేసేదాన్ని’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, స్వాతి తల్లిదండ్రులు ఇప్పటికే ఆమెకు కర్మకాండలు నిర్వహించేశారు. ‘అల్లుడుతో పాటు నా కూతురు కూడా చచ్చిపోయింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన నా కూతురు బతికున్నా చచ్చిన శవంతో సమానం’ స్వాతి తండ్రి లింగారెడ్డి గుండు గీయించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles