Aadhaar linking deadline extended to March 31 ఆధార్ అనుసంధానానికి వెసలుబాటు

Supreme court extends all aadhaar linking deadlines to march 31

Aadhaar, Aadhaar linking, Aadhaar link deadline, Supreme Court, How to link Aadhaar, Aadhaar PAN link, Aadhaar mobile link, Aadhaar bank account link, Welfare schemes, Aadhar number

The Supreme Court today extended the date of Aadhaar linking with welfare schemes and services till March 31, 2018.

సర్వోన్నత న్యాయస్థానం లింకింగ్ సమయాన్ని పోడిగించిందోచ్..!

Posted: 12/15/2017 11:57 AM IST
Supreme court extends all aadhaar linking deadlines to march 31

దేశపౌరులలో నెలకొన్న అందోళనను ఎట్టకేలకు అర్థం చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెసలుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతోపాటు, ఇతర సేవలకోసం ఆధార్ లింకింగ్ ను తప్పనిసరి చేసిన క్రమంలో సుప్రీంకోర్టు దేశపౌరులకు భారీ ఊరట నిచ్చింది. ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలకు విధించిన గడువును మార్చి 31, 2018 వరకు పొడగిస్తూ ఇవాళ మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదే సమయంలో అధార్ కార్డులో పోందుపర్చిన దేశ పౌరుల వ్యక్తిగత వివరాలను కేంద్ర ప్రభుత్వం సుమారుగా అన్ని సేవలకు తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయంపై జనవరి మాసం నుంచి వాదనలు ప్రారంభమవుతాయని కూడా పేర్కొనింది. దీంతో ఆధార్ చట్టం చట్టబద్ధత అంశంపై తదుపరి వాదనలను జనవరి 17వ తేదీకి వాయిదా  వేసింది. కాగా, ప్రధాన న్యాయమూర్తి దీపాక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు  జడ్జిల ధర్మాసనం ఈ విషయంపై మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది

దీంతో అన్ని ప్రభుత్వ పథకాలు,  బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్ల తో పాటు ఇన్సూరెన్స్, డీమ్యాట్, ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ లింకింగ్‌ గడువును పొడగించించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న  వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు  ఉపశమనం కల్పించింది. అలాగే కొత్త బ్యాంకు ఖాతాలను తెరవడానికి కూడా  ప్రస్తుతానికి ఆధార్‌ అనుసంధానం అవసరం లేదని తేల్చి చెప్పింది.  ఆధార్‌ నంబర్‌ లేకుండానే  బ్యాంకు ఖాతాను  తెరవచ్చని  స్పష్టం చేసింది.  

అయితే ఆధార్‌ కార్డుకోసం దరఖాస్తు చేసిన కాపీని జతచేయాలని తెలిపింది.  దీంతోపాటు 2018, ఫిబ్రవరి 6వ తేదీతో  ముగియనున్న మొబైల్‌ ఆధార్‌లింకింగ్‌ గడువును కూడా మార్చి 31 వరకు పొడిగించింది.  ఇప్పటికే ఈ అంశంపై నమోదేన పిటీషన్ పై వ్యక్తిగత వివరాలు పౌరుల హక్కు అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానికి చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తులు బెంచ్ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhar card  linking procedure  Extended  supreme court  services  

Other Articles