PM and Ex-PM shake hands after war of words అక్కడ మాటల కత్తులు.. ఇక్కడ చక్కగా పలకరింపులు..

Pm modi manmohan singh s handshake after bitter war of words

2001 Indian Parliament attack, 2001 Parliament attack, 2001 Parliament terror attack, Assembly elections 2017, Congress Pakistan, gujarat, Gujarat Assembly elections 2017, Gujarat elections Pakistan, hamid ansari, Mani Shankar Aiyar, Mani Shankar Aiyar dinner, manmohan singh, Modi Manmohan meet, Narendra Modi, Narendra Modi Manmohan Singh, pakistan, Pakistan foreign minister dinner, Pakistan interference Gujarat elections, Pakistan threat, pakistani diplomats, parliament house, parliament of india, pm modi, Sonia Gandhi, ‪Afzal Guru, ‪Parliament House, ‪‪Parliament attack

After a bitter war of words during a keenly contested Gujarat election, PM Modi and his predecessor Dr. Manmohan Singh met at the Parliament House and shook hands.

అక్కడ మాటల కత్తులు.. ఇక్కడ చక్కగా పలకరింపులు..

Posted: 12/13/2017 07:11 PM IST
Pm modi manmohan singh s handshake after bitter war of words

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యార్, మాజీ ప్రధాని పాకిస్థాన్ నేతలతో తన చంపడానికి సుఫారీ కూడా మాట్లాడుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరోపణలు చేయడం దేశవ్యాప్తంగా చర్యనీయాంశంగా మారింది. అయితే ఇంతటి దారుణమైన అరోఫణలు చేసిన తరువాత ఇవాళ ప్రధాని మోడీ.. మాజీ మన్మోహన్‌ సింగ్‌  ఒకరికోకరు పరస్పరం ఎదురుపడ్డారు. నిన్నటి వరకు చేసుకున్న అరోపణలు, ప్రత్యారోపణలు మర్చిపోయిన నేతలు ఇవాళ పరస్పరం ఎదురుపడగానే మర్యాదపూర్వకంగా అభివాదం చేసుకున్నారు.

ప్రధాని రాకను గమనించిన మాజీ ప్రధాని తన చేతులు జోడించి నమస్కారం పెట్టగా.. మోడీ ఆ చేతులను కలిపి ముందుకు సాగారు. 2001 పార్లమెంటుపై దాడిలో మృతిచెందిన అమరులకు నివాళి అర్పించేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు పరస్పరం ఎదురుపడ్డారు. పార్లమెంటుపై దాడి ఘటన జరిగి నేటికి 16 ఏళ్లు కావస్తున్న తరుణంలో ఈ ఘటనలో  అమరులైన తొమ్మిదిమందికి నివాళులు అర్పించేందుకు వారు పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, మన్మోహన్‌సింగ్ తోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమఆ పలువురు నేతలు పాల్గొన్నారు.

పార్లమెంటు లోపలికి వెళుతున్న సమయంలో మోదీ, మన్మోహన్ పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా చేతులు జోడించి ఇద్దరూ అభివాదం చేసుకున్నారు. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, మన్మోహన్‌ మాటల కత్తులు దూసుకున్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పాకిస్థానీ అతిథులతో సమావేశమై.. గుజరాత్ ఎన్నికల గురించి చర్చించారని, గుజరాత్‌ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలను కొట్టిపారేసిన కాంగ్రెస్ ప్రధాని బేషరుతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు, దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌కు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కరచాలనం చేసి గ్రీటింగ్స్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manmohan Singh  Narendra Modi  Gujarat Assembly election 2017  Pakistan  Congress  BJP  Amit Shah  politics  

Other Articles