Eshwarappa tips on lying, video goes viral బీజేపి నేత గెలుపు సూత్రాలు.. వీడియో వైరల్

Lie if you have to bjp leader eshwarappa tells party workers

K S Eshwarappa, BJP, Karnataka BJP, Congress, Karnataka Assembly election, K S Eshwarappa video, Eshwarappa, BJP, Partymen, Video, Karnataka

KS Eshwarappa, Leader of the opposition in the Karnataka legislative council, finds himself in a soup after a video has surfaced where he is seen telling his party men, “Lie if you have to, but don't admit you don't know.”

ITEMVIDEOS: బీజేపి నేత గెలుపు సూత్రాలు.. వీడియో వైరల్

Posted: 12/13/2017 06:40 PM IST
Lie if you have to bjp leader eshwarappa tells party workers

ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రజా సమస్యలు తెలుసుకుంటారు.. పాదయాత్రలు చేస్తారు.. లేదా ముందుగానే వాగ్ధానాలను నెరవేర్చుతారు.. కుల సంఘాల నేతలతో చర్చలు జరిపి వారిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అయితే ఇవన్నీ వ్యయప్రసాసలతో కూడినవి. ఇన్ని కష్టాలు పడినా.. తమకు ఓట్లు పడతాయో లేదో.. తమను ప్రజలు విశ్వసించారో లేదోనన్న అందోళన మాత్రం నేతల్లో వుంటుంది. అయితే గెలుపు ప్రకటన వచ్చేంత వరకు ఈ తరహా ప్రయాసలు తప్పవు.

అయితే పార్టీలు సర్వశక్తులు ఒడ్డి.. గెలుపే ధ్యేయంగా పనిచేసినా అందరు అభ్యర్థులను విజయాలు వరించవు. అందుకనే నేతలు కూడా అవసరమైప్పుడల్లా అడ్డదారులు తొక్కేస్తుంటారు. అబద్దాలు చెబుతుంటారు.. ప్రత్యర్థులపై పస లేని అరోపణలు చేస్తుంటారు.. అవసరమైతే అభూత కల్పనలను కూడా సృష్టిస్తారు. అబాంఢాలు కూడా వేస్తుంటారు. అరచేతిలో వైకుంఠం చేపిస్తారు.. నెరవేర్చలేని హామీలను గుప్పిస్తుంటారు. ఏలా చేసైనా.. ఏమి చేసైనా అధికారంలోకి రావడమే పరమావది.. అనుకునే నేతలు కూడా మన దేశంలో చాలామందే వున్నారు.

ఇలాంటివి చేసైనా సరే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఓ నేత తమ కార్యకర్తలు చెబితే ఎలా వుంటుంది. ఔరా..! ఇప్పుడు మనకు చెబుతున్న ఈ మాటలను అధికారంలోకి వచ్చిన తరువాత మాకు కూడా ఇలానే చెబితే ఏం చేస్తామన్న అలోచన కార్యకర్తల్లోనూ ఉత్పన్నమయితే.. వారేం చేస్తారు.. పార్టీలో మనగలుగుతారా..? అసలు రాజకీయాలపై వారికి ఎలాంటి అభిప్రాయం నెలకొంటుంది..? అదే యువతకు ఇలాంటి సందేశాలను ఇస్తే వారు తీసుకోరాదల్చుకన్న రాజకీయ మార్పు ఎలా సాథ్యమవుతుంది.?

ఇందుకు నిదర్శనమే కర్ణాటక బీజేపీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు అవసరమైతే అబద్దాలు చెప్పండి.. అని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు.  కొప్పాల్‌ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా వచ్చే ఏడాది ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను అందరూ కలుపుకుపోవాలని ఆయన చెప్పారు. ఆయ‌న చేసిన ప్ర‌సంగానికి చెందిన వీడియో ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో హాట్ టాపిక్‌గా మారింది. జ‌న‌తాద‌ళ్ సెక్యుల‌ర్ పార్టీ ఈ అవ‌కాశాన్ని పూర్తిగా వాడుకుంది. త‌మ పార్టీ ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను ఉంచింది. దాదాపు 85 వేల మంది ఈ వీడియోను చూశారు. 2000 మంది ఈ వీడియోను షేర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eshwarappa  BJP  Partymen  Video  Karnataka  

Other Articles