vijay sai suicide case investigation on fast track విజయ్ సాయి అత్మహత్య కేసు దర్యాప్తు వేగవంతం..

Comedian vijay sai suicide case investigation on fast track

vijay sai, comedian vijay sai, shashidar, lawyer srinivas, advocate srinivas, school certificates, passport, tollywood vijay sai contractor, vijay sai vanita, vijay sai threatened, vijay sai autopsy, vijay sai complaint, vijay sai shashidar, vijay sai rowdies, vijay sai vanita car, tollywood vijay sai, tollywood comedian vijay, comedian vijay, ammayelu abbayelu, vijay, comedian vijay sai, vijay death, comedian vijay sai death

jubilee hills police begins tollywood young comedian vijay sai suicide case investigation on fast track, and to question as the comedian who alleged wife vanitha, and two others the main reason for his suicide in a selfie video

విజయ్ సాయి అత్మహత్య కేసు దర్యాప్తు వేగవంతం..

Posted: 12/13/2017 11:06 AM IST
Comedian vijay sai suicide case investigation on fast track

టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఆయన పోస్టుమార్టం పూర్తైన క్రమంలో క్రితం రోజునే అంత్యక్రియలు కూడా నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో విజయ్ సాయి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో తొలుత విజయ్ సాయి తల్లిదండ్రుల వివరణను ఇవాళ రికార్డు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నారు. అదే సమయంలో విజయ్ సాయి సెల్పీ వీడియో అధారంగా కూడా కేసును దర్యాప్తు చేయనున్నారు.

విజయ్ సాయి ఆత్మహత్య వెనుక కుటంబ కలహాలే కారణమని ఆయన వీడియో రికార్డింగ్ స్పష్టం చేస్తున్న క్రమంలో ఆయన అరోపించినట్లుగానే అయన భార్య వనిత అలియాస్ వరలక్ష్మీతో పాటు బడా కాంట్రాక్టర్ శశిధర్, వనిత విడాకుల కేసు వాదిస్తున్న న్యాయవాది శ్రీనివాస్ లను కూడా విచారించనున్నారు. ఇప్పటికే విజయ్ సాయి అత్మహత్యకు ఒక్క రోజు ముందు తమకు ఇచ్చిన పిర్యాదు కూడా పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆ రోజు అయనపై దాడికి పాల్పడిన నలుగురు రౌడీలు ఎవరనేది కూడా దర్యాప్తు చేయనున్నారు.

ఇక పోలీసుల దర్యాప్తులో వనతి వ్యవహర తీరుపై పోలీసులకు ఇప్పటికే అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. అమె పేరు వనిత కాదని, వరలక్ష్మీ అని తెలుసుకన్న పోలీసులు అమెకు ఇద్దరు తండ్రులు వున్నారన్న విషయాన్ని కూడా దర్యాప్తులో తెలుసుకున్నారు. ఇక అమె తల్లి కూడా రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందని కూడా కనుగొన్నారు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనితతో పాటు శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

వనితపై విజయ్ సాయి తండ్రి అరోపణలు

విజయ్ సాయి భార్య వనిత అలియాస్ వరలక్ష్మిపై ఆయన తండ్రి ఇవాళ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయినంత మాత్రాన.. భర్త అంత్యక్రియలకు భార్య హాజరుకాకుండా వుంటుందా..? అని అయన ప్రశ్నించారు. భర్తపై అమెకు ఎంత ప్రేమ ఉందో దీని బట్టే అర్థమవుతుందని అన్నారు. విజయ్ సాయితో వున్నంత కాలం అమె కేవలం డబ్బునే ప్రేమించిందని, విడాకుల కోసం కోర్టుకు వెళ్లినా.. డబ్బు, బంగారు నగలను తీసుకెళ్లిపోయిందని అరోపించారు. ఇక తండ్రి కడసారి చూపులకు కూడా కూతుర్ని దూరం చేసిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comedian  vijay sai  suicide  vanita  shashidar  srinivas  tollywood  crime  

Other Articles