Madhu Koda convicted in coal block allocation scam మధుకోడా.. బొగ్గు గనుల కుంభకోణంలో దోషే

Madhu koda convicted in coal block allocation scam case

coal scam, madhu koda, hc gupta, rajhara north coal block allocation, cbi, coal scam and madhu koda, Madhu Koda, coal scam, coal block allocation, VISUL, Jharkhand coal mines

A special CBI court held former Jharkhand chief minister Madhu Koda, former Coal Secretary H C Gupta, former Jharkhand Chief Secretary Ashok Kumar Basu and one other as guilty in the coal scam case.

జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా.. బొగ్గు గనుల కుంభకోణంలో దోషే

Posted: 12/13/2017 11:35 AM IST
Madhu koda convicted in coal block allocation scam case

బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కోంటున్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. దీంతో బొగ్గు బ్లాకులు కుంభకోణం కేసులో మధుకోడాకు ఎదరుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణం కేసులో సుదీర్ఘకాలం విచారణ చేసిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి  మధుకోడాను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆయనకు విధించనున్న శిక్షలను కోర్టు రేపు (గురువారం) ప్రకటించనుంది.

ఈ కేసులో మధుకోడాతో పాటుగా బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులతో పాటుగా మరొకరిని కోర్టు దోషులుగా తేల్చింది. బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణాల్లో వీరందరి పాత్ర వుందని తేల్చిన న్యాయస్థానం.. వీరికి కూడా గురువారం నాడే శిక్షలు ఖరారు చేయనుంది. కాగా కోల్ కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి  కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఐదుగురిపైనా చార్జిషీట్ దాఖలు అయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhu Koda  coal scam  coal block allocation  VISUL  Jharkhand coal mines  

Other Articles