tollywood comedian vijay sai commits suicide కమెడియన్ విజయ్ సాయి అత్మహత్య..

Shocking tollywood comedian vijay sai commits suicide

tollywood comedian vijay sai, comedian vijay sai, tollywood vijay sai, tollywood comedian vijay, comedian vijay, ammayelu abbayelu, vijay, comedian vijay sai, vijay death, comedian vijay sai death

tollywood young comedian vijay sai who made name and fame by working in various films including Bhaskar’s Bommarillu, Ravi Babu directorial Ammayilu Abbayilu, soggadu is no more.

షాకింగ్: టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి అత్మహత్య..

Posted: 12/11/2017 12:29 PM IST
Shocking tollywood comedian vijay sai commits suicide

తెలుగు చిత్రసీమను మరోమారు షాకింగ్ న్యూస్ డిప్రెషన్ లోకి తీసుకెళ్లింది. తన హ్యసంతో తెలుగు ప్రేక్షకులను అనతికాలంలోనే అకట్టుకున్న టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మాయిలు – అబ్బాయిలు చిత్రంలో ఒక హీరో స్నేహితుడిగా తెలుగు తెరకి పరిచయం అయిన విజయ్.. ఆదివారం రాత్రి ఆత్మహత్య పాల్పడినట్లు సమాచారం. హైదరాబాదులోని యూసుఫ్ గూడలో గత తన ఫ్లాట్ లో సోమవారం ఉదయం చనిపోయి కనిపించాడు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది.

బొమ్మరిల్లు, ఒకరికి ఒకరు, సోగ్గాడు వంటి అనేక చిత్రాలలో నటించి హాస్యాన్ని పండించగల కమెడియన్ గా పేరుతెచ్చుకోవడంతో పాటు, టైమింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు పొందాడు ఈ యువ కామెడియన్. అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో పాటు.. ఇక ముందు వచ్చే అవకాశాలు కూడా కనిపించకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. దీనికి తోడు అర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువయ్యాయి. అప్పులు కూడా పెరిగిపోవడంతోనే గత్యంతరం లేని పరిస్థితిలో తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని విజయ్ సాయి సన్నిహితులు చెబుతున్నారు.

ఎప్పుడూ నవ్విస్తూ, చలాకీగా ఉండే విజయ్ ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డైరెక్టర్ రవిబాబు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు విజయ్ సాయి. అమ్మాయిలు, అబ్బాయిలు, బొమ్మరిల్లు, ఒకరికి ఒకరు, నువ్వేకావాలి, వేచి ఉంటా, చిరుజల్లు, యూత్, వరప్రసాద్, పొట్టి ప్రసాద్, బ్యాక్ పాకెట్, సోగ్గాడు, కరెంట్ లాంటి సినిమాల్లో విజయ్ సాయి నటించాడు.

విజయ్ సాయి మరణానికి వనితే కారణం: విజయ్ తల్లి

టాలీవుడ్ కామెడియన్ విజయ్ సాయి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారన్న వార్త తెలిసి అతని కుటుంబసభ్యులు అతని ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. అయితే విజయ్ అత్మహత్యకు అర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు కూడా కారణమని తెలుస్తుంది. బుల్లితెరపై టీవీ సిరియల్ అర్టిస్టుగా పనిచేస్తున్న వనితను విజయ్ పెళ్లి చేసుకున్నాడు. వారికి మూడేళ్ల బాబు కూడా వున్నాయి. అయితే బాబు పుట్టిన కొద్ది కాలం వరకు సాఫీగానే వున్న వారి సంస్కార జీవితంలో వివాదాలు రేగాయి.

భర్తకు సినిమా అవకాశాలు లేకపోవడంతో.. అమె అతనితో దూరంగానే వుంటుందని కూడా సమాచారం. మూడేళ్లుగా మీరి మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరాయి. కాగా మూడు రోజుల క్రితం విజయ్ ఫ్లాట్ కు వచ్చిన వనిత.. అతని కారును కూడా బలవంతంగా తీసుకువెళ్లిందని సమాచారం. అటు భార్యతో సఖ్యత లేకపోవడం.. ఇటు సినిమా పరిశ్రమలో అవకాశాలు రాకపోవడం.. మరోవైపు అర్థిక ఇబ్బందులు అంతకంతకూ అధికమవ్యడంతో.. గత్యంతరం లేక విజయ్ ప్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచరం.

కాగా, గత మూడేళ్లుగా విజతన కొడుకు విజయ్ మరణానికి అతని భార్యే కారణమని విజయ్ తల్లి అరోపించారు. తన కొడుకును అకాల మరణానికి అతని భార్య వనితే కారణమని అన్నారు. వనిత తన కొడుకున నిత్యం డబ్బు కోసం వేధించేదని అందుచేత తన కొడుకు విజయ్ అత్మహత్యకు పాల్పడ్డాడని అవేదన వ్యక్తం చేశారు. అయితే రంగురంగుల ప్రపంచమని.. రంగుల రాట్నమని తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చే ఎందరో నటీనటులను అక్కున చేర్చుకున్నా.. అప్పడప్పుడూ మాత్రం ఇలాంటి విషాదకర వార్తలు చిత్రిపరిశ్రమపై విమర్శలకు కూడా కారణమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comedian  vijay sai  suicide  yousufguda  tollywood  crime  

Other Articles