Mercury dips as winter says hello to telugu states చలి పులి పంజా: వైరల్ జ్వరాల విజృంభన

Mercury dips as winter says hello to telugu states

temperature, Telangana, SangaReddy, Medak, Indian Meteorological Department, imd hyderabad, imd, viral fever, influenza, andhra pradesh, lambaingi, araku

As the mercury plummeted further to 14.9 degree Celsius on Sunday morning, there has been a sharp increase in viral fever and influenza among other diseases in the city.

చలి పులి పంజా: వైరల్ జ్వరాల విజృంభన

Posted: 12/11/2017 11:05 AM IST
Mercury dips as winter says hello to telugu states

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసిరడం ప్రారంభించింది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా వడిపోతున్నాయి. దీనికి తోడు ఉత్తరాది నుంచి వీస్తూవస్తున్న చలిగాలులు ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో రెండు రోజుల నుంచి క్రమంగా చలితీవ్రత పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనిపించకపోవడంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చలిమంటలతో సేద తీరుతున్నారు.

చలి గాలులతో ఉదయం, రాత్రి సమయాల్లో…రికార్డు స్థాయిలో కనిష్ట  ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలుగా నమోదయ్యింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇవి ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువే అయినా చలి మాత్రం చంపేస్తోంది. శనివారం 17.1 డిగ్రీలుగా ఉన్న నగర కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కరోజులోనే 15.9 డిగ్రీలకు పడిపోయింది. ఇకపై రోజూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మరో వైపు ఏజెన్సీ ప్రాంతాలు మంచుదుప్పటి కప్పుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు అంతకంత పడిపోతున్నాయి.

దీంతో శీతాకాలంలో విజృంభించే వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. అనేక మంది చిన్నారులు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు చిన్నారుల నుంచి అటు వృద్దుల వరకు అందరూ వ్యాధుల బారిన పడుతున్నారు. రాష్ట్రాల్లోని ప్రభుత్వ సహా ప్రైవేటు అస్పతులు కూడా రోగులు, వారి బంధువులతో నిండిపోతున్నాయి. వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వ వైద్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న దాఖలు మాత్రం ఇప్పటికీ లేవు.

దీంతో చలికి ఇళ్ల నుంచి బయటకు రావటానికి బయపడుతున్నారు జనం. చలి మంటలు కాచుకుంటున్నారు. ముఖ్యంగా  ఖమ్మంలో 5 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండలో 4 ,ఆదిలాబాద్ లో 7, మెదక్‌లో 9, హైదరాబాద్‌లో 15 , నిజామాబాద్‌లో 13 , రామగుండంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత  నమోదైంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజల్లో వణుకు మొదలైంది. చాలా చోట్ల ఉదయం 8 గంటల దాకా పొగమంచు కనిపిస్తున్నది. సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే రోడ్లపై సందడి తగ్గిపోతున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles