Shekar Reddy's Diary Hints at Pay Offs to OPS మళ్లీ వార్తల్లోకి శేఖర్ రెడ్డి.. సంచలనంగా మారిన డైరీ

Mining baron shekar reddy s diary hints at pay offs to ops

bribe allegations, Income Tax Department sources, mining baron Shekar Reddy, O Panneerselvam, Shekar Reddy, VK Sasikala

In the documents accessed by IT Officials, diary reportedly exposes corruption in top rungs of the Tamil Nadu Government and there are several purported references to politicians, indicating payoffs.

మళ్లీ వార్తల్లోకి శేఖర్ రెడ్డి.. సంచలనంగా మారిన డైరీ

Posted: 12/09/2017 10:05 AM IST
Mining baron shekar reddy s diary hints at pay offs to ops

నోట్ల రద్దు నేపథ్యంలో తన వద్దనున్న రూ.80 కోట్ల రూపాయలను  అక్రమంగా మార్పిడి చేసుకుని.. ఏకంగా అర్బీఐ నుంచి కొత్త నోట్లను భారీ కంటేనర్ వాహనంతో తన ఇంటికి తెప్పించుకన్న ఇసుక కాంట్రాక్టర్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి ఈ వ్యవహారంలో అరెస్టు అయిన తరువాత మళ్లీ ఆయన వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా మారారు. ఇటీవల వెలుగుచూసిన ఆయన డైరీలోని ప్రముఖుల పేర్లుపై సిబిఐ చేత విచారణ జరిపించాలని తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్ చేస్తుంది.

గతేడాది నవంబరులో తమిళనాడులో శేఖర్ రెడ్డి, అతని భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీశాఖ చేసిన దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, స్థిర, చరాస్తుల పత్రాలు బయటపడ్డాయి. వీటితో పాటు ఓ డైరీని కూడా అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో శేఖర్ రెడ్డికి అంతర్గత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆనాటి వివరాలను నిర్ధారిస్తున్నట్లుగా పలు అంశాలను ఒక ప్రైవేటు ఆంగ్ల టీవీ చానల్ క్రితంరోజున ప్రసారం చేసింది.

డైరీలోని కొన్ని పేజీలు తమచేతికి వచ్చాయని చెప్పింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు విజయభాస్కర్, ఎంసీ.సంపత్, తంగమణి, ఆర్పీ ఉదయకుమార్, దిండుగల్లు శ్రీనివాసన్, ఎంఆర్‌ విజయభాస్కర్, కేసీ కరుప్పన్నన్ ల పేర్లు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు శేఖర్‌రెడ్డి డైరీ ద్వారా వెలుగుచూసిన వివరాలపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

ఆరుమాసాల క్రితం జరిగిన అర్కేనగర్ ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వానికి, ఐటీ అధికారులకు, ఎన్నికల సంఘం అధికారులకు అవినీతి కనిపించినప్పుడు.. అంతకన్నాముందుగానే శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగి.. అయన ఇంటి నుంచి విలువైన పత్రాలు తీసుకెళ్లినా.. వాటి అధారంగా మాత్రం ఐటీ దాడులు జరగలేదంటే అందుకు కారణమం ఏంటని స్టాలిన్ ప్రశ్నించారు. బీజేపి వాటిని అడ్డుపెట్టుకుని తమిళనాడులో తమ ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తుందని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles