Gujarat Elections 15% Turnout in first two hours జోరందుకున్న గుజరాత్ తొలిదశ పొలింగ్..

Gujarat elections first phase polling 15 turnout recorded in first two hours

Amit Shah, BJP, congress, Election Commission of India, elections 2017, Electronic voting, gujarat Assembly election 2017, Gujarat Assembly elections 2017, Gujarat assembly first phase polling, Gujarat election first phase polling, Gujarat election first phase voting, Gujarat election news, Gujarat election updates, Gujarat election voting date, Gujarat elections, Gujarat Elections 2017, Gujarat polling, gujarat polls, Gujarat polls 2017, Gujarat voting, Hardik Patel, Jignesh Mewani, Mani Shankar Aiyar, Narendra Modi, pm modi, Rahul Gandhi, saurashtra, Vidhan sabha chunav 2017, Vidhan sabha election, Vijay Rupani, Voting time in Gujarat election, VVPAT, ‪Gujarat‬, ‪State Assembly elections in India‬, ‪Vidhan Sabha‬‬

Voting is underway across 89 seats in Saurashtra and South Gujarat. Prominent names among 977 candidates in the fray include Chief Minister Vijay Rupani, who is contesting from Rajkot

జోరందుకున్న గుజరాత్ తొలిదశ పొలింగ్..

Posted: 12/09/2017 09:22 AM IST
Gujarat elections first phase polling 15 turnout recorded in first two hours

గుజరాత్‌ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ జోరందుకుంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకన్నారు. గుజరాత్ అభివృద్దిలోనే కాదు పోలింగ్ కూడా రికార్డును నమోదు చేయాలన్న ప్రధాని నరేంద్రమోడీ వినతిని ప్రజలు స్వీకరించారు. తొలి రెండు గంటల వ్యవధితోనే దాదాపుగా 15 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.

సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ సీఎం విజయ్‌ రుపాని, కాంగ్రెస్‌ నేత శక్తి సిన్హ్‌ గోహిల్‌ సహా మొత్తం 977 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ తొలిదశ ఎన్నికలలో మొత్తంగా 397 మది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎం మెషీన్లతో పాటు వివిపాట్ పోలింగ్ యంత్రాలను కూడా ప్రవేశపెట్టారు. అయితే పోలింగ్ సమయం ప్రారంభంలో అనేక చోట్ల ఈవీఎం యంత్రాలు మొరాయించాయి. కొన్న ఈవీయం యంత్రాలను అధికారులు మరమ్మతులు చేయగా, మరికొన్నింటిని మాత్రం రీప్లేస్ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 14న మిగిలిన స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 18న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

కాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్‌ పార్టీ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రాష్ట్రంలో తాము ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. గుజరాత్‌ నుంచి బీజేపీని తుడిచిపెడతామని అంటోంది. 'గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ వస్తుందని మేం విశ్వాసంతో ఉన్నాం. 22 ఏళ్ల తర్వాత గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. రాష్ట్రం నుంచి బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. గుజరాత్ లో ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆ మార్పును అందిస్తుంది' అని పార్టీ సీనియర్‌ నేత రాజు వాఘ్‌మారే పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat  assembly polls  amit shah  vijay rupani  Pm Modi  Rahul Gandhi  Politics  

Other Articles