pawan kalyan wants politics free from caste and religion రంగా పేరెత్తకుండా బెజవాడ రాజకీయాలు మాట్లాడలేం: పవన్

Pawan kalyan wants politics free from caste and religion

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, vangaveeri mohana ranga, ranga, ranga vijayawada politics, TDP leaders, wrong propaganda, paritala ravi, tonsure, gundu, ethnic qualities, fatima students, fatima medical college, fatima students pawan kalyan, caste, Indian, human, vijayawada, party activists, telugu states tour, political tour, Andhra Pradesh

Jana Sena founder president and chief Pawan Kalyan alleges telugu desam party was in the power when ranga was murdered in vijayawada, felt sad about the aftermaths of the incident. And also gives call for caste and religion free politics.

రంగా పేరెత్తకుండా బెజవాడ రాజకీయాలు మాట్లాడలేం: పవన్

Posted: 12/08/2017 07:02 PM IST
Pawan kalyan wants politics free from caste and religion

అంధ్రప్రదేశ్ లో సామాజిక వర్గాల మధ్యనన్న పోరు పోయినప్పుడే అమరావతి లాంటి రాజధానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, అప్పటివరకు ఎంత అత్యాధునిక సాంకేతికతతో భవనాలను నిర్మించినా లభం లేదని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ఈ సందర్భంగా మరోమారు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు పవన్. డబ్బులు లేనప్పుడు ఆడంబరాలకు వెళ్లకూడదని, ప్రజలు ఆనందంగా లేనప్పుడు ఎంత పెద్ద రాజధాని కట్టినా వృథానే అని పేర్కొన్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘జనసేన’ పార్టీ ఆఫీసు ఏర్పాటు నిమిత్తం స్థలాన్ని పరిశీలించారు.

స‌మాజం ముందుకు వెళ్లాలంటే కులాల ప్ర‌స్తావ‌న ఉండ‌కూడ‌దని అన్నారు. విజ‌య‌వాడ‌లో ప్ర‌జ‌లు కులాల ఉచ్చులో ఇరుక్కుపోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులపై కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పవన్.. అభిమానం ఉండాలి కానీ, ఇబ్బంది పెట్టేలా ఉండ‌కూడ‌ద‌న్నారు. విజ‌య‌వాడ రావ‌డం నాకు చాలా ఇబ్బంది... ఇబ్బంది దేనికో చెబుతాను.. బాబుల‌కి బాబు క‌ల్యాణ్ బాబు అంటూ నినాదా‌లు చేస్తారు. ఇవన్నీ నాకు న‌చ్చ‌వు. దాంట్లో ఏముంది? చెప్పండి. మీ అభిమానం ప్ర‌జ‌ల‌ని ఇరిటేట్ చేసేలా వుండకూడదు. ఆనందింప‌జేసేలా ఉండాలి. విజ‌య‌వాడ‌కి ఇంకా చాలా బ‌ల‌మైన ఆలోచ‌న విధానం రావాలని పిలుపునిచ్చారు.

విజయవాడ వచ్చి రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు వంగ‌వీటి రంగ పేరును లేకుండా మాట్లాడలేమని పవన్ అన్నారు. రంగా హత్యోదంతం సమయంలో రాష్ట్రంలో వున్నది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఒక నిరాయుధుడ్ని చంపడం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆ హత్యోదంతం తరువాత రేగిన అల్లర్లలో క‌మ్మ కులం వారితో పాటు అనేక వర్గాల ప్రజలపై దాడులు జరిగాయని.. ఆ అల్లర్లు రేపిన గాయాలు కూడా తనకు బాధ కలిగించాయని అన్నారు. ఇప్పటికీ ఆ బాధ చాలా మందిలో ఉండిపోయిందని చెప్పారు.

అందుకనే విజయవాడతో పాటు అంధ్రప్రదేశ్ లో రాజకీయాలను సమూలంగా మర్చాలని పవన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఇంకా కులాల కుమ్మలాటలేమిటీ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కులప్రభావం అంతగా లేదని, అక్కడున్నదంతా తెలంగాణ వాదమేనని అన్నారు.  ఎంతో వేగంగా అభివృద్ది చెందిన విజయవాడ.. కులం ఉచ్చులో చిక్కుకుందని అన్నారు. తాను నెల్లూరులో పెరిగాను. అక్కడ తన కులమేంటని ఎవరూ అడగలేదు. హైదరాబాదులోనూ ఎవరూ అడగలేదు.. కానీ ఈ రోజుకీ, ఇంకా విజయవాడ మారలేదని అన్నారు.

కులరహిత సమాజం ఏర్పడాలి.. కులాల ఐక్యత పెరగాలనే తాను తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో మద్దుతునిచ్చానని చెప్పారు. టీడీపీ తనపై వ్యక్తిగతంగా అబద్దపు విషయాలను ప్రచారం చేసినా.. తాను అవన్నీ మనస్సులో పెట్టుకోకుండా అమరావతి ప్రపంచస్థఆయి రాజధాని కావాలనే లక్ష్యంతో టీడీపీకి మద్దుతునిచ్చానని చెప్పారు. ఇక దీనికి తోడు అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకున్నాని చందబ్రాబు, జగన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని బేరీజు వేసుకుని చంద్రబాబుకు మద్దతునిచ్చానని పవన్ చెప్పారు. సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టే చంద్రబాబుకు సపోర్ట్ చేశానని, చెప్పిన సమస్యలు విని పరిష్కరించే వ్యక్తి ఆయన అని ప్రశంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles