pawan kalyan satires on nara lokesh and jagan కోట్లో, కోట్ల రూపాయల వ్యాపారాలో మా నాన్న ఇవ్వలేదు: పవన్

Didn t got crores or crores turnover companies as legacy pawan kalyan

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, nara lokesh, heritage, crores turnover companies, ys jagan, crores of ruppess, ethnic qualities, fatima students, fatima medical college, fatima students pawan kalyan, caste, Indian, human, rajamundry, party activists, telugu states tour, political tour,Andhra Pradesh

Jana Sena founder president and chief Pawan Kalyan satirical comments on Nara Lokesh and YS Jagan, says he didnot recieve any crores of rupees, crore turnover company as legacy fronm his father espect ethinic qualites

కోట్లో, కోట్ల రూపాయల వ్యాపారాలో మా నాన్న ఇవ్వలేదు: పవన్

Posted: 12/08/2017 04:40 PM IST
Didn t got crores or crores turnover companies as legacy pawan kalyan

గత రెండు రోజులుగా తన పార్టీ సిద్దాంతం, తన పంథా, తన వెనకు వచ్చే యువత గురించి మాత్రమే ప్రసంగించిన జనసేన అధినేత, సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇవాళ తనదైన శైలిలో రాష్ట్ర యువనేతలను టార్గెట్ చేశారు. వారిపై సుత్తిమెత్తగా సైటిరికల్ గా వ్యంగాస్త్రాలు సంధించారు. చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా విశాఖ, తూగో, పగో జిల్లాలో పర్యటించిన పవన్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఓ సమావేశంలో తనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారాలోకేశ్ లపై  విరుచుకుపడ్డారు.

జగన్ కు వాళ్ల తండ్రి రాజశేఖరరెడ్డి ఇచ్చినట్టు తన తండ్రి తనకు కోట్లు ఇవ్వలేదని.. అలాగే లోకేశ్ కు వాళ్ల నాన్న ఇచ్చినట్లు కోట్ల రూపాయల టర్నోవర్ తో నడిచే పాల ఫ్యాక్టరీలను కూడా  ఇవ్వలేదని అన్నారు. తన తండ్రి తనకు సన్మార్గంలో నడవటం.. దీక్షా, పట్టుదల, అహింస, కార్యోన్ముఖత, న్యాయం, ధర్మం గురించి చెప్పిన సూక్తును మాత్రమే ఇచ్చారని చెప్పారు. తనకు అధికార దాహం లేదని, పిచ్చి అంతకంటే లేదని పేర్కొన్న పవన్.. తన తండ్రి ఇచ్చిన అపారమైన అస్తి అని, అది ఎందరికి పంచినా ఎన్నటికీ తరగదని చెప్పారు.

తనకు డబ్బులు ఇస్తామని ఎవరూ రాలేదని చెప్పిన పవన్ అలాంటి వారు ఎవరోచ్చినా తాను వాటిని తీసుకోనని, ఇతరుల మాదిరిగా తాను అమ్ముడుపోయే రాజకీయాలకు తెరతీయనని.. తనకు రాజకీయాలంటే చాలా గౌరమవని కూడా చెప్పుకోచ్చారు. డబ్బులు తీసుకుంటే ప్రజలకు తనమీద నమ్మకం, విశ్వాసం ఎలా ఉంటాయని అన్నారు. ఈ రోజు ఏ ముఖ్యమంత్రిని అడిగినా ఓట్లు కొనలేకపోతున్నామంటున్నారని, అసలు ఓట్లను ఎందుకు కొనాలని పవన్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Pawan Kalyan  chalore chalore chal  vijayawada  nara lokesh  ys jagan  ethnic qualities  politics  

Other Articles