Video of swamiji with woman goes viral కొప్పల్ సన్యాసి శృంగార వీడియో బట్టబయలు, ఉద్రిక్తత

Tension among devotees at karnataka s koppal mutt after seer s sleaze video surfaces

kottureshwara, uday ravi, koppal swamiji, swamiji sex scandal, swamiji sleaze video, mallaiah herur, Bengaluru, Karnataka, karnataka news online, karnataka news paper, karnataka political news, recent news in karnataka, crime

Tension prevailed for a short time at the Virakta Kalmutt in Gangavathi town in Karnataka’s Koppal district on Thursday after Kottur Swamiji of the mutt was reportedly caught in a sex scandal

ITEMVIDEOS: వైరల్: కొప్పల్ సన్యాసి శృంగార వీడియో బట్టబయలు, ఉద్రిక్తత

Posted: 12/08/2017 05:31 PM IST
Tension among devotees at karnataka s koppal mutt after seer s sleaze video surfaces

స్వామీజీలు తాము ఐహిక వాదులమని, సన్యాసులమని, తమకు దేనిపైనా అశలదేని అంటూనే కాళ్లు మొక్కడానికి వేలు, కాళ్లు కడగడానికి లక్షలు, ఇళ్లలోకి వచ్చి పూజలు చేయడానికి ఇంకెంతో తీసుకుంటుంటారు. అయితే దానికి అనేక లెక్కలు చెబుతుంటారు. ఇంతవరకే అయితే బాగనే వుండు కానీ.. హద్దు దాటి దొంగచాటుగా దాంపత్య జీవితాలను సాగించడమే హాట్ టాపిక్ గా మారుతుంది. తమ సన్యాసి జీవితాన్ని ఓ కన్య ఎదుటో, లేక మహిళ ఎదుటో దారపోసి శృంగారంలో వున్న అనుభూతిని కూడా రుచిచేస్తుంటారు. ఈ విషయం బయటపడితే కామిగాని వాడు మోక్షగామి కాలేడని మరీ వాదిస్తుంటారు.

ఇలాంటి నీచకార్యాలకు పాల్పడిన ఓ సన్యాన్ని గుట్టు తాజాగా రట్టైంది. దీంతో కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. జిల్లా ప్రజలతో పాటు అయనను వ్యతిరేకించే వారు కూడా కలసి స్వామీజికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. ఇక మరికొందరు మాత్రం ఆయన తమకు స్వామీజీయేనని, అయన చేసే ప్రతిపనిలోనూ మంచి వుంటుందని ఆయనపై మూడభక్తిని కనబరుస్తు మద్దతిస్తున్న భక్తులు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నారు. దీంతో ఇరువర్గాలకు మధ్య ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కొప్పల్ లోని కలమత మఠం పీఠాధిపతి కొట్టురేశ్వర స్వామికి చెందిన రాసలీలలు బయటకు వచ్చాయి. ఆయన ఓ మహిళతో ఏకాంతంగా, సన్నిహితంగా గడిపిన దృశ్యాల వీడియో బయటకు రావడంతో అదికాస్తా నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో మఠం వద్దకు చేరుకుని ప్రధాన గురువు, పీఠాధిపతి అయిన 56 ఏళ్ల కొట్టురేశ్వరను ఆ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇవన్నీ నిజం కాదని, కావాలనే స్వామిని అప్రదిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నంగా ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు.

కలమత మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది లింగాయత్ లకు చెందిన మఠం. 1995లో కొట్టురేశ్వర పీఠాధిపతి అయ్యారు. వీడియోలో కనిపిస్తున్న మహిళను స్వామీజీకి వంట చేసి పెట్టడానికి 2010లో తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. స్వామీజీతో ఆమె ఏకాంతంగా గడిపిన సందర్భాన్ని వీడియో తీసి మాజీ డ్రైవర్ మల్లయ్య హెరూర్ బయటపెట్టాడు. దీని తర్వాత, తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని అతడు గంగావతి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. మఠాధిపతి లైంగిక వేధింపులపై తమకు ఫిర్యాదు అందలేదని కొప్పల్ టౌన్ సబ్ ఇన్ స్పెక్టర్ ఉదయ్ రవి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles