MP Assembly Passes Bill to Hang Rapists 12 రేపిస్టులకు ఇక ఉరే.. హస్తిన అమోదమే మిగిలింది...

Mp assembly passes bill to hang rapists of girls below 12

Madhya Pradesh, Bhopal, rape, gangrape, 12 years old, minor girls, sexual assault on minors, crime against minors, mp government, crime

The state government drew flak from all quarters for the lackadaisical and insensitive manner in which the issue was handled by the police.

రేపిస్టులకు ఇక ఉరే.. హస్తిన అమోదమే మిగిలింది...

Posted: 12/04/2017 06:29 PM IST
Mp assembly passes bill to hang rapists of girls below 12

ఉత్తర భారతదేశంలో మహిళలు, అడపిల్లలపై అత్యాచారాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతున్న నేపథ్యంలో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న పాలకపక్షం ఎట్టకేలకు నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుక ఉపక్రమించింది. దీంతో నూతన బిల్లును రూపోందించిన ప్రభుత్వం దానిన అసెంబ్లీలో పెట్టి అమోదింపజేసింది. దీంతో ఇకపై ఈ రాష్ట్రంలో పన్నెండేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి ఇక ఉరి శిక్ష విధించనుంది.

ఈ మేరకు ఇవాళ మధ్యప్రదేశ్‌ శాసనసభ ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ తీర్మాణాన్ని ఇక కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. దీనిని ఉభయ పార్లమెంటు సభలు అమోదించిన పిమ్మట రాష్ట్రపతి కూడా అమోదం తెలిపిన తరువాత బిల్లు చట్టరూపం దాల్చుతుంది. దీంతో 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడినట్లైతే కనీసం 14 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణించేంతవరకు జీవిత కాలపు శిక్ష విధిస్తారు. గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడితే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేటట్లు ఈ బిల్లు రూపొందించారు.

అలాగే బాలికలపై వేధింపులకు పాల్పడినా జైలు శిక్ష మరింత కఠినంగా విధించేటట్లు బిల్లుకు రూపం ఇచ్చారు. ఈ బిల్లు గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారు మనుషులు కారని, వారు దయ్యాలతో సమానం అని వ్యాఖ్యానించారు. వారికి జీవించే హక్కు లేదని అన్నారు. పదే పదే వేధింపులకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు విధిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles