big dip in mercury in telugu states వామ్మో.. చలిపులి చంపేస్తానంటుంది.. పోగమంచు కూడా..!

Telugu states records very low temperatures

telugu states, low temperatures, dip in mercury, andhra pradesh, telangana, telugu states shiver with low temperatues, north india, cold wave

Low Temperatures are being recorded at the start of winter season in the month of december in both the Telugu States, Badrachalam and Hanmakonda records lowest of 4 degrees, while Lambasingi recorded 5 degrees Low Temperature

వామ్మో.. చలిపులి చంపేస్తానంటుంది.. పొగమంచు కూడా..!

Posted: 12/05/2017 09:50 AM IST
Telugu states records very low temperatures

ఉత్తర భారతదేశంలో శీతలకాలం ముంచె తెన్నరను కమ్మెస్తున్న ఘటనలను మనం చూస్తున్న క్రమంలోనే అదే పొగమంచు ఇప్పుడు తెలుగురాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుంది. తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసరుతుంది. ఓఖి తుపాను కారణంగా కొన్ని రోజుల పాటు ప్రభావం చూపని చలి తీవ్రత మళ్లీ విజృంభిస్తుంది. దీంతో గత నాలుగైదు రోజుల నుంచి క్రమంగా చలితీవ్రత పెరుగుతుంది. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.  

రాష్ట్ర వ్యాప్తంగానూ క్రితం రోజు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. మొన్నటిదాకా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 నుంచి 20 మధ్య ఉన్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత కూడా అంతకంతకూ పెరుగుతూ ప్రజల్లో వణుకు పుట్టిస్తుంది. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు పరిసరాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోదకొండమ్మ పాదాలులో 7 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఘాట్ రోడ్ కేంద్రంగా పేర్కొనే పాడేరు, అరకుల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇటు తెలంగాణలో  ఖమ్మంలో 5 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండలో 4 ,ఆదిలాబాద్ లో 7, మెదక్‌లో 9, హైదరాబాద్‌లో 12 , నిజామాబాద్‌లో 13 , రామగుండంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత  నమోదైంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజల్లో వణుకు మొదలైంది. చాలా చోట్ల ఉదయం 8 గంటల దాకా పొగమంచు కనిపిస్తున్నది. సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే రోడ్లపై సందడి తగ్గిపోతున్నది.

రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా గత నాలుగు రోజుల్లో 30 డిగ్రీల నుంచి 25 డిగ్రీలకు పడిపోయాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగి.. పొద్దెక్కినా మంచుతెరలు వీడడం లేదు.  దీనితో ఉదయం ఎనిమిది దాటినా చలి తగ్గడం లేదు. ఉదయాన్నే స్కూల్ పిల్లలు, ఇతర పనులపై వెళ్లే ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి బయటకు వస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తున్నది. గ్రామీణ తెలంగాణలోని ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటలకే చలి ఎక్కువ అవుతుండడంతో గ్రామాల్లో జనసంచారం తగ్గింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu states  low temperatures  dip in mercury  andhra pradesh  telangana  cold wave  

Other Articles