kapu reseravation creates legal hurdles says: krishnaiah కాపు రిజర్వేషన్ చెల్లుబాటు కాదు..

R krishnaiah counter to minister achennaidu on kapu reservation

kapu community, kapu, andhra pradesh government, andhra pradesh govt, chandrababu naidu, R. Krishnaiah, ap assembly, achennaidu, mudragada padmanabham, mudragada, mudragada strike, mudragada kapu reservation, ap assembly kapu reservation, R krishnaiah, politics

Backward classes Leader R.Krishnaiah says kapu reseration may creates legal hurdels as it is not done in a correct manner, he also alleges that it is just a political stunt just befor forth comming elections.

అచ్చెన్నా.. చెల్లుబాటు కాదంటూ అర్ క్రిష్ణయ్య కౌంటర్..

Posted: 12/02/2017 04:08 PM IST
R krishnaiah counter to minister achennaidu on kapu reservation

బీసీలకు నష్టం లేకుండా కాపులను బీసీల్లో చేర్చామని, బిల్లును అమోదించిన తరువాత గవర్నర్ ద్వారా దానిని కేంద్ర అమోదానికి పంపుతామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లుపై సభలో మాట్లాడుతూ ఈ నిర్ణయం అనంతరం బీసీలు ఏకంకావాలని, పోరాటం చేయాలని ఆర్‌.కృష్ణయ్య లాంటి వారు పిలుపునిచ్చారని... అసలు ఎందుకు పోరాడాలని సభ ద్వారా ప్రశ్నిస్తున్నానన్నారు. తమ నిర్ణయం ద్వారా బీసీలకు పాయింట్ శాతం అన్యాయం జరిగిందని ఎవరైనా సాక్ష్యాలతో చూపిస్తే పదవికి రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు.

అయితే కాపులను బీసీల్లో చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసినా... ఆచరణలో అది సాధ్యం కాదని... రాబోయే కాలంలో చట్టపరంగా, న్యాయపరంగా సమస్యలు తలెత్తుతాయని బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించాలంటూ మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వగానే హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారని... దీనిపై డిబేట్ జరిగి ఉండాల్సిందని అన్నారు. కాపులకు రిజర్వేషన్లను కల్పించడం అంటే బీసీలను మోసం చేయడమేనని చెప్పారు.

రాజకీయ లబ్ధి కోసమే ఏపీ, తెలంగాణల్లో రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుండటం దారుణమని అన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కాకుండా... జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లను కల్పించాలన్న ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జనాభాలో 52శాతం మంది బీసీలు ఉన్నారని... మరి వారికి అంత శాతం రిజర్వేషన్లు లేవు కదా? అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles