Martyr's Daughter Dragged Away From Gujarat CM's Rally కళ్లముందు ఏం జరిగినా.. సీఎంకు కనబడదా..?!

Video of martyr s daughter stopped from meeting vijay rupani goes viral

gujarat, gujarat cm vijay rupani, bsf jawan daughter dragged away, bsf jawan, vijay rupani rally, Vijay Rupani In Viral Video, Vijay Rupani Chief Minister, crime

Rupal's father Ashok Tadvi was a BSF jawan who was martyred. Rupal has been known to be protesting since her father's death for a piece of land that was to be allotted to the family.

కళ్లముందు యువతిని లాక్కెళ్లినా.. సీఎంకు కనబడదా..?!

Posted: 12/02/2017 01:03 PM IST
Video of martyr s daughter stopped from meeting vijay rupani goes viral

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఇటీవల తన అవేదన వ్యక్తం చేసినట్లుగానే పరిస్థితులు మారిపోతున్నాయి. ఓ పక్క విపక్ష పార్టీ ప్రచారం జోరు అందుకుంటుంటే.. అధికార పక్షానికి చెందిన ప్రచారం మాత్రం చతికిలపడిపోతుంది. అన్నింటినీ సర్ధుకుని పోదాములే అని వెళ్తున్న అధకార పక్షానికి ఊహించని పరిణామాలు ఎదురువుతూ.. ఎన్నికల వేళ అష్టకష్టలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఈ పరిణామాలపై విపక్షాల నుంచి కూడా విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదరువుతుంది.

గుజరాత్ లో మా పరిస్థితి బాగోలేదు.. అంతకంటే ముఖ్యంగా నా పరిస్థితి మరీ బాగోలేదు అని ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పిన విషయాన్ని కోట్ చేస్తూ ఆయన రాజ్ కోట్ లో నిర్వహించిన ర్యాలీలో పట్టుమని పాతిక మంది కూడా పాల్గోనకపోవడంపై అప్ బహిష్కృత నేత, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇటీవలే ఓ వీడియోను పోస్టు చేయగా, తాజాగా గుజారాత్ ముఖ్యమంత్రి నిండు సభలో యువతి ఝలక్‌ ఇచ్చింది. విజయ్ రూపానీ ప్రసంగిస్తున్న ఓ సభలో మద్యలో లేచిన ఓ యవతి అయనను కలవాలని డిమాండ్ చేస్తూ.. అందుకు అనుగూణంగా నినాదాలు చేసింది.

ఈ పరిణామంతో షాక్ తిన్న పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకెళ్లడం రచ్చ రేపింది. ఇక ఆ యువతి కూడా ఓ అమర వీరజవాన్‌ కూతురు కావటంతో ప్రభుత్వంపై విమర్శలు మరింతగా చెలరేగుతున్నాయి. విషయం ఏంటంటే... శుక్రవారం వడోదరా జిల్లాలోని కేవదియా కాలనీలో నిర్వహించిన ప్రచార సభలో విజయ్‌ రూపానీ ప్రసంగిస్తున్నారు. ఇంతలో రూపల్‌ తాద్వి(26) అనే యువతి సీఎం ప్రసంగానికి అడ్డు తగిలింది. తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. రూపల్‌, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అశోక్‌ తాద్వి కూతురు. అశోక్‌ విధినిర్వహణలో ప్రాణాలు వదిలారు.  

దీంతో ప్రభుత్వం ఆ కుటుంబానికి భూమిని ఇస్తామని ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఆ హామీ నెరవేరకపోవటంతో ఆ కుటుంబం కష్టాలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆయన సభ విషయం తెలుసుకున్న రూపల్‌ అక్కడి గుంపులో కూర్చుంది. ప్రసంగం కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా సీఎం వేదిక వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న మహిళ కానిస్టేబుళ్లు ఆమెను లాక్కెళ్లారు. ‘నేను ఆయన్ని కలవాలి. నన్ను వదలండి’ అంటూ ఆమె అరుస్తున్నా.. పోలీసులు వదలకుండా ఈడ్చుకెళ్లారు. ఈ సమయంలో రూపానీ అదేం పట్టించుకోకుండా రాహుల్‌ గాంధీని విమర్శిస్తూ ప్రసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chief Minister  vijay rupani  bsf jawan daughter  dragged away  rahul gandhi  gujarat  Viral Video  

Other Articles