AP CM confronts Center over Polavaram irrigation project పోలవరంపై వెనక్కు తగ్గలేం.. నిర్మాణ బాధ్యత కేంద్రానిదే..

Chandrababu confronts ally bjp over polavaram irrigation project

Chandrababu Naidu, Telugu Desam Party, BJP, Polavaram irrigation project, Narendra Modi, nitin gadkari, major irrigation project, state bifuraction issues

The Andhra Pradesh CM accuses the Centre of putting spanners in the project after the water resources ministry asked the state to withhold a fresh tender called for construction of a project’s channel.

పోలవరంపై వెనక్కు తగ్గలేం.. నిర్మాణ బాధ్యత కేంద్రానిదే..

Posted: 12/01/2017 04:02 PM IST
Chandrababu confronts ally bjp over polavaram irrigation project

పోలవరం ప్రాజెక్టుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిలో టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. పోలవరంపై రాజకీయం చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లడతానన్నారు. అలాగే పోలవరం నిర్మాణంపై ప్రతివారం సమీక్ష చేస్తున్నామని, ఏ మాత్రం అలసత్వం వహించినా ప్రాజెక్టు నిర్మాణం వెనుకపడుతుందని చంద్రబాబు అన్నారు.

ప్రస్తుతం పొలవరం పనులు జోరందుకున్నాయని, ఈ దశలో పనులు నిలిపేస్తే.. మళ్లీ అవి తిరిగి చేపట్టడానికి తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నారు. వేగంగా పనులు జరుగుతున్న క్రమంలో ఎలాంటి విఘాతం కల్గించకుండా పనులన్నీ సక్రమంగా పూర్తేయ్యేలా చేయాలని కేంద్రాన్ని కోరారు. పనులను అపితే నిర్మాన వ్యయం కూడా పెరుగుతుందని అందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాన బాధ్యత కేంద్రానిదేనని చెప్పిన ఆయన  విభజన సమస్యలు.. పరిష్కారాలపై స్టేటస్ రిపోర్ట్ కూడా ఇచ్చాంమని, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేయూతనివ్వాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాన విషయంలో కేంద్రంపై విమర్శలు చేసేసి.. ఏదో ఒకటి మాట్లాడొద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. మరోవైపు సచివాలయం నిర్మాణ డిజైన్లను ఓకే చేశామని వెల్లడించారు. ఈ-గవర్నెన్స్‌తో కదలిక వచ్చిందని, పెండింగ్‌ ఫైల్స్‌ తొందరగా క్లియర్‌ అవుతున్నాయన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పేపర్ లెస్‌ కార్యకలాపాలు జరుగుతాయని, ఇప్పటికే రాజధానిలో పలు విద్యాసంస్థల పనులు ప్రారంభమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే త్వరలో హెచ్‌సీఎల్ పనులు ప్రారంభమవుతాయని, అమరావతిలో ఎలక్ట్రికల్ వాహనాలే ఎక్కువగా ఉంటాయని, కాలుష్య రహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles