Government lists 42 Chinese apps as dangerous షేర్ఇట్, ట్రూకాల్ లాంటి 42 యాప్స్ వెంటనే తొలగించండీ

Government reportedly lists 42 chinese popular apps as dangerous

Chinese apps, Chinese apps ban, Indian army, Intelligence, Xiaomi, WeChat, Weibo, SHAREit, Mi Store, Mi community, indian government, intelligence, 42 chinese apps, home ministry, military, paramilitary, defence, army, navy, air force, china phones

Chinese apps have once again come under the security scanner in India and this time there are more than 40 apps in the list.

షేర్ఇట్, ట్రూకాలర్ సహా 42 యాప్స్ తో భద్రం సుమా..!

Posted: 12/01/2017 03:22 PM IST
Government reportedly lists 42 chinese popular apps as dangerous

ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో అదే చేతిలో మీ సమాచారాన్ని దొంగలించే దొంగను కూడా పట్టుకున్నారన్న విషయం మీకు తెలుసా..? అవును మీరు ఏ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నా సరే.. ఈ యాప్ లు మీ ఫోన్ లు వుంటే.. మీకు తెలియకుండానే మీకు మాత్రమే సంబంధించిన వ్యక్తిగత సమాచారం నుంచి మీ ఫోన్ లో నిక్షిప్తమై వున్న అత్యంత కీలక సమాచారం వరకు అన్ని మీకు తెలియకుండానే చౌర్యానికి గురవుతాయన్న విషయం మీకు తెలుసా..? కానీ ఇది ముమ్మాటికీ నిజమని దీని వల్ల ముప్పు పోంచివుందని కూడా దేశప్రజలను అప్రమత్తం చేస్తుంది.

మరీ ముఖ్యంగా చైనా కేంద్రంగా తయారైన స్మార్ట్ ఫోన్ వల్ల దేశభద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక వీటితో పాటు ఇన్ బిల్డ్ గా వస్తున్న మొబైల్ యాప్స్ ద్వారా మీకు సంబంధించిన సమాచారం దొంగలించ బడుతుందని హెచ్చరిస్తుంది. ఒక వేళ మీరు వాడుతున్నది చైనా ఫాన్ కాకపోయినా.. అదేశానికి చెందిన యాప్స్ ను డౌన్ లోడ్ చేయటం ద్వారా మీ భద్రతకు ముప్పు పొంచి దేశ ప్రజలను అప్రమత్తం చేసింది భారత ఇంటెలిజెన్సు. అంతేకాదు అటు భారత సైన్యాన్ని కూడా ఈ విషయంలో హెచ్చరించింది. ఈ యాప్ లతో సైనికులకు ముప్పు పొంచి వుందని కూడా అప్రమత్తం చేసింది.

చైనా మొబైల్ ఫోన్లతోపాటు.. 42 యాప్స్ ను డేంజర్ లిస్ట్ కింది ప్రకటించింది. వీటిని వెంటనే స్మార్ట్ ఫోన్ల నుంచి తొలగించాలని సైన్యంలోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇంటెలిజెన్స్. 42 యాప్స్ లో భారత భద్రతా వ్యవస్థకే ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. ఈ యాప్స్ వాడటం ద్వారా ఫోన్లలోని సమాచారం అంతా చైనాకి చేరిపోతుందని వార్నింగ్ బెల్ మోగించింది. వీటిలో అత్యంత పాపులర్ అయిన షేర్ ఇట్, ట్రూకాలర్, యాంటీ వైరస్, వెబ్ బ్రోజర్స్ వంటివి ఉన్నాయి. ఏ యాప్ అయినా డేటాను అధికంగా వినియోగిస్తుంటే.. అది కచ్చితంగా అదనపు సమాచారాన్ని సేకరిస్తుందని భావించాలని భద్రతా నిపుణులు సందీప్ సేన్ గుప్తా వెల్లడించారు.

ఇంటెలిజెన్స్ హెచ్చరించిన 42 డేంజర్ యాప్స్ ఇవే :

వీబో, వి చాట్‌ , షేర్‌ఇట్‌ , ట్రూకాలర్‌, యూసీ న్యూస్‌, యూసీ బ్రౌజర్‌, ఎంఐ స్టోర్‌, ఎంఐ వీడియో కాల్‌, ఎంఐ కమ్యూనిటీ , క్లీన్‌మాస్టర్‌, 360 సెక్యూరిటీ, డియు రికార్డర్‌, డియు ప్రైవసీ, డియు బ్రౌజర్‌, డియు క్లీనర్‌, డియు బ్యాటరీ సేవర్‌, వైరస్‌ క్లీనర్‌ పర్‌ఫెక్ట్‌ కార్ప్‌ సీఎం బ్రౌజర్‌, బ్యూటీ ప్లస్‌, న్యూస్‌ డాగ్‌, వివా వీడియో-క్యూయూ వీడియో, యు క్యామ్‌ మేకప్‌, ఫొటో వండర్‌, ప్యారెలల్‌ స్పేస్‌, క్యాచి క్లీనర్‌, వాల్ట్‌హైడ్‌, వండర్‌ కెమెరా, సెల్ఫీ సిటీ, మెయిల్‌ మాస్టర్‌, వి సింక్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, బైడు ట్రాన్స్‌లేట్‌ , బైడు మ్యాప్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌ , క్యూక్యూ ఇంటర్నేషనల్‌, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ మెయిల్‌, క్యూక్యూ ప్లేయర్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ లాంచర్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles