metro rail to issue passes soon మియాపూర్ టు నాగోల్ @ సింగల్ రైలు.. త్వరలో పాసులు

Hyderabad metro soon starts single rail service from miyapur to nagole

metro rail charges review, metro rail single service, miyapur to nagole, metro charges should be reviewed, metro rail charges review, high metro rail charges, metro rail common man, metro rail taxi rates, metro rail auto charges, PM modi, hyderabad metro rail, metro train Shedule, metro rail services, metro rail rates, pm modi metro rail, miyapur, kukatpally, metro rail project, telangana

hyderabad metro rail soon starts single rail service from muyapur to nagole, and also issues monthly passes, said metro rail officials.

మియాపూర్ టు నాగోల్ @ సింగల్ రైలు.. త్వరలో పాసులు

Posted: 11/29/2017 07:20 PM IST
Hyderabad metro soon starts single rail service from miyapur to nagole

హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు విజయవంతమయ్యాయని, సర్వీసులు ప్రారంభించన తొలిరోజునే నగరవాసులు నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాదీయులకు శుభకాంక్షలు తెలిపిన ఆయన తొలి రోజున లక్ష మంది ప్రయాణికులను అంచనా వేశామని అయితే కేవలం పది గంటల వ్యవధిలో సాయంత్రం నాలుగు గంటల వరకు గంటల వరకు 50వేల మంది ప్రయాణించారని అయన తెలిపారు.

ఇక రాత్రి పదిగంటలకు సర్వీసులు నేటికి సేవలకు సెలువు తీసుకునేలోపు లక్ష మంది ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణించే అవకాశముందని అంచనా వేశారని.. దీంతో మెట్రో రైలు విజయవంతమైందని ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ్టి నుంచి నగరంలో మెట్రో సర్వీసులు ప్రారంభం కావటంతో ఆయన తన సిబ్బందితో అన్ని మెట్రో స్టేషన్లను పరిశీలించారు.

తొలిరోజు కాబ్టటి ప్రయాణికులు కొంత ఇబ్బందులకు గురయ్యారన్న విషయాన్ని అంగీకరించిన ఆయన త్వరలోనే మియాపూర్ నుంచి నాగోల్ వరకు సింగిల్ రైల్ సర్వీసును ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక ధరల విషయంలో రోజు ప్రయాణాలు చేయాల్సిన ప్రయాణికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో త్వరలోనే నెలవారీ పాసులను కూడా అందజేస్తామని చెప్పారు. దీంతో నిత్యం ప్రయాణం చేసేవారికి ఇది కొంతమేరకు డబ్బును అదా చేస్తుందనిి కూడా చెప్పారు.

ఇక ప్రయాణికులు మెట్రో నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. మొదటిరోజు కావడంతో ప్రయాణికులు ఎక్కువగా సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఆ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి స్టేషన్ లో 64 సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్నారు. నాగోల్-మియాపూర్ మధ్య ప్రస్తుతం 14 ట్రైన్స్ నడుపుతున్నట్లు చెప్పారు. అన్ని స్టేషన్లలో సెక్యూరిటీ పర్ఫెక్టుగా ఉందన్న ఎండీ.. మియాపూర్ లో పార్కింగ్ కోసం 10 ఎకరాలు కేటాయించామన్నారు. మిగతా స్టేషన్లలో కూడా స్థలాన్ని బట్టి పార్కింగ్ ఏర్పాటు చేయనునట్లు వెల్లడించారు. 2018 జూన్ నాటికి హైటెక్ సిటీ వరకు మెట్రో అందుబాటులోకి వస్తోందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro rail  hyderabad  nagole  ameerpet  passengers  miyapur  passes  single service  telangana  

Other Articles