Bomb threat kept cops on toes at falaknuma palace బాంబు బెదిరింపుగాళ్ల భరతం పడతాం..

Bomb threat kept cops on toes at falaknuma palace dinner

Ivamja trump, Narendra Modi, KCR, Governor, PM Modi, US secret service agency, bomn threat call, ivanka dinner threat call, ivanka falaknuma threat call, Hyderabad police, Faluknama Palace, Bomb threat, Hoax call, Old city, Telangana Police, crime

A bomb threat by an anonymous caller kept a section of the police on their toes just when Ivanka Trump joined a dinner hosted by PM Modi at historic Faluknama palace.

బాంబు బెదిరింపుగాళ్ల భరతం పడతాం..

Posted: 11/29/2017 06:21 PM IST
Bomb threat kept cops on toes at falaknuma palace dinner

ఆసియా ఖండంలోనే తొలిసారిగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హైదరాబాద్ ను వేదిక చేయడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అంతా సజావుగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్ రావడం.. అటు పోలీసులను ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.

అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతరు, సలహాదారు ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, అంతేకాదు దేశ విదేశాలకు చెందిన 1500 మంది పారిశ్రామిక వేత్లలు.. అందులో అత్యధికంగా మహిళా పారిశ్రామిక వేత్తలే వున్నారు. ఎక్కడ ఏ చిన్న లోపం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, యావత్ దేశానికే అపఖ్యాతి ముడుతుందని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇవాంక కు కేంద్ర ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది.

ఇవాంక అటుగా వచ్చి చేరుకోగానే ఫలక్ నుమా ప్యాలెస్ కు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఓ వర్గం పోలీసులు చల్లని గాలులు వీస్తున్నా.. లోలోన మాత్రం చమటలతో తడిసి ముద్దైయేలా ఉరుకులు పరుగులు పెట్టారు. ఎందుకంటే ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్ లో బాంబును అమర్చామని ఆ ఫోన్ కాల్ సారాంశం. దానిపై అరా తీసిన పోలీసులు అది ఇంటర్ నెట్ ద్వారా అనుసంధానమై ఫోన్ కాల్ అని కనుగొన్నారు.

ఇక దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సిరీయస్ గా వుంది. అసియా ఖండంలో ఎవరికీ దక్కిన అవకాశం తమకు దక్కిన నేపథ్యంలో ఇలాంటి ఫేక్ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రాష్ట్రం పరుపును దేశం ప్రతిష్టను దిగజార్చేలా చేస్తుందని, ఆ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ గాళ్ల భరతం పట్టాలని పోలీసు శాఖకు అదేశాలను జారీ చేసింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాంక స్వదేశానికి పయనమైన తరువాత వారి భరతం పట్టేందుకు సన్నధమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Ivanka Trump  bomb threat call  falaknuma palace  Hyderabad police  Telangana  

Other Articles