దేశరాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన యావత్దేశంలో సంచలనంగా మారి మహిళలపై జరిగే అత్యాచారాలను త్వరితగతిన పరిష్కారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయినా దేశంలో అబలలపై అఘాయిత్యాలకు అడ్డకుట్టపడలేదు. ఈ తరహా నేరాలు ఉత్తారిధి రాష్ట్రాల్లోనే పెద్దఎత్తున్న నమోదవుతున్నాయి. ఇక జాతీయ నేరాల రికార్డుల బ్యూరో గణంకాల ప్రకారం మహిళలు, బాలికలపై దేశంలో పెద్దఎత్తున్న అఘాయిత్యాలు జరిగే రాష్ట్రంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో వుంది. దీంతో ఆ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులను అడ్డుకట్ట వేసేందుకు మరో అడుగు ముందుకేసింది. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండడంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
మహిళలపై సామూహిక అత్యాచారం చేసే నిందితులకు కూడా మరణ శిక్ష విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాచారం రుజువైన పక్షంలో నిందితులకు విధించే శిక్ష, జరిమానా మొత్తాన్ని పెంచేందుకు సైతం శిక్షా స్మృతిని సవరించేందుకు సైతం అంగీకారం తెలిపింది. ఇక.. మహిళలపై అత్యాచారయత్నం చేసినా, వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ శీతాకాల సమావేశాల్లో శాసనసభలో బిల్లు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి జయంత్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 17 | హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ... Read more
May 17 | కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి... Read more
May 17 | ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి... Read more
May 17 | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు... Read more
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more