దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాలనుసారం అశ్లీలతకు తావులేకుండా బార్ లలో అమ్మాయిల నృత్యాలకు అనుమతిని ఇవ్వడంతో కొంతకాలం పాటు అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో మళ్లీ అశ్లీలత రాజ్యమేలుతుంది. బార్లలో అమ్మాయిల నృత్యాలకు అత్యున్నత న్యాయస్థానమే అనుమతిని మంజూరు చేసిన నేపథ్యంలో పోలీసులు బార్ నిర్వాహకులకు పలు అంక్షలు విధించారు.
దీంతో మొదట్లో అంక్షల మేరకే నడుచుకున్న బార్ నిర్వాహకులు.. తమ వైపు పోలీసులు దృష్టి సారించడం లేదని తెలియడంతో.. అశ్లీలతకు తెరలేపారు. దేశ అర్థిక రాజధాని ముంబైలోని ఓ బార్ లో అర్ధనగ్నంగా అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తుండగా ప్రత్యేక పోలీసులు దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బార్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న పక్క సమాచారంతో దాడి చేసిన ముంబై స్పెషల్ టాస్క్ పోర్స్ పోలీసులు బార్ సిబ్బందితో పాటు 15 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.
కంజూర్ మార్గ్ పోలీసుస్టేషను పరిధిలోని ములంద్ ఎల్బీఎస్ రోడ్డుపై ఉన్న ప్రముఖ బార్ లో 15 మంది అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తుండగా అదనపు పోలీసు కమిషనర్ లక్ష్మీగౌతం నేతృత్వంలోని పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వారందరినీ కౌన్సిలింగ్ ఇచ్చి.. మహిళాసదనానికి తరలించారు. అండర్ వరల్డ్ గ్యాంగ్ సభ్యులు వచ్చే ఈ బార్లో యజమాని భరత్ ఠాకూర్, క్యాషియర్ వెంకటేష్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more