YS jagan, swamiji photo goes viral on social media జగన్, స్వామీజి ఫోటో వైరల్.. ఎందకయ్యా అంటే..

Ys jagan swamiji photo goes viral on social media

YS jagan, cbi court, disappropriate assets, chandrababu, vote for note case, TDP, YSRCP, praja sankalpa yatra, kurnool, andhra pradesh , politics

YS Jagan mohan reddy meets a swamiji in his praja sankalpa yatra, the comments on this photo from his supporters and opposite party supporters making viral

జగన్, స్వామీజి ఫోటో వైరల్.. ఎందకయ్యా అంటే..

Posted: 11/25/2017 11:32 AM IST
Ys jagan swamiji photo goes viral on social media

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిన ముఖ్యమంత్రి తప్పించుకుని తిరుగుతున్నాడని, గత ప్రభుత్వాల హాయంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ.. గోవిందార్పణం చేసి కేవలం తాను, తన కుమారుడు, తన బావమరిది బాలకృష్ణ చుట్టూనే రాజకీయాలను తిప్పుకుంటూ పార్టీ నేతలను కూడా అవమానసరుస్తున్న చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు చెందిన ఓ ఫోటో ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో ఆయన యాత్ర సాగుతున్న క్రమంలో ఓ స్వామీజీ జగన్ ను పలకరిస్తున్న ఫొటో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటోకి జగన్ మద్దతుదారులు తమదైన శైలిలో కామెంటరీ పోస్ట్ చేశారు. ‘‘ఏందయ్యా జగన్ బాబు, నీకు ఈ కష్టాలు.. ఎలా ఉండాల్సిన వాడివి ఎలా ఉన్నావు? సొమ్ము ఒకరిది సోకు మరొకరిదిలా ఉంది నిన్ను చూస్తుంటే.దోచుకుని దాచుకుని తింటుంది ఒకరు ప్రజల కష్టాలు మాత్రం నీకా !!! మంచి రోజులు వస్తాయి జగన్ బాబు. సాక్షాత్తు ఒక స్వామీజీ మన జగన్ అన్నతో అన్న మాటలు ఇవి...’’ అంటూ జగన్ ఫాలోయర్స్ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
 
దీనిపై నెటిజన్లు భిన్నరీతిలో స్పందిస్తున్నారు. ‘‘నిజమే ప్రతి శుక్రవారం జడ్జి దర్శనం చేసుకుని రావాలంటే కష్టంగానే ఉంది. ఏం చేస్తాం.. బిడ్డ అల్లాడి పోతున్నాడు.’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నిజం గెలుస్తుందిలే స్వామీజీ’,.. ‘జగన్ సీఎం అవుతాడు’ అంటూ ఇంకొంతమంది కామెంట్ చేశారు. వీటికి కూడా జగన్ మద్దుతదారులు మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ అడ్డంగా దోరికిపోయినా.. బుకాయించే మాటలతో భ్రమల్లో బతికే నేతలు ముఖ్యమంత్రులు కాగా లేనిది.. జగన్ అయితే తప్పేంటని కౌంటరిస్తున్నారు. ఈ పోటోపై అభిమానులు తమ రాజకీయ అవగాహనను అవపోషణ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS jagan  cbi court  chandrababu  vote for note case  TDP  YSRCP  praja sankalpa yatra  politics  

Other Articles