Beyhadh actor arrested on rape charges లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ టీవీ అర్టిస్ట్ అరెస్టు..

Tv actor arrested for raping 23 year old fashion designer

piyush sahdev rape, piyush sahdev rape charges, piyush sahdev arrest, rape accusation against piyush sahdev, piyush sahdev arrested, piyush sahvdev arrested for rape, piyush sahdev booked for rape

Piyush Sahdev was was arrested by the Mumbai police after a girl, said to be a model, filed a case against him. The Versova police have kept Piyush in custody until November 27.

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ టీవీ నటుడు అరెస్టు..

Posted: 11/25/2017 09:55 AM IST
Tv actor arrested for raping 23 year old fashion designer

బుల్లి తెరపై నటిస్తూ సెటబ్రిటీ స్టేటస్ వచ్చిన తరువాత భార్యకు విడాకులిచ్చి వార్తల్లోకి ఎక్కిన ప్రముఖ టీవీ నటుడు పియూష్ సహదేవ్.. మరోమారు పతాకశీర్షకలకు ఎక్కారు. 35 ఏళ్ల ఈ నటుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డిన కేసు నమోదు కావడంతో ముంబైలోని వెర్సోవా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నెల 27 వరకు బేహద్ నటుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.

ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ తనపై బుల్లితెర నటుడు పియూష్ సహదేవ్ అత్యాచారానకి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఒక ఫ్యాషన్ షోలో తనకు సహదేవ్ పరిచయం అయ్యాడని... ఆ తర్వాత తనతో స్నేహం చేశాడని.. ఈ క్రమంలో స్నేహం ముసుగులో తనపై లైంగిక వేధింపులకు పాల్పడి, మోసం చేశాడని సదరు ఫ్యాషన్ డిజైనర్ (23) తన ఫిర్యాదులో పేర్కొంది.

తామిద్దరం సహజీవనం చేస్తున్నామని... పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో సహదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు... అతడిని అంధేరి మోట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు అతడికి 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. బేహద్ దేవోంకే దేవ్ మహదేవ్, హర్ ఘర్ కుచ్ కెహతా హై లాంటి పాప్యులర్ హిందీ సీరియల్స్ లో సహదేవ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : piyush sahdev  sexual assault  arrest  rape charges  fashion model  beyhadh  mumbai  crime  

Other Articles