Two leaves symbol goes to EPS-OPS, rules EC సీఎం, ఢిప్యూటీ సీఎంలకే రెండాకుల గుర్తు..

Eps ops faction wins back aiadmk s two leaves symbol

aiadmk, AIADMK symbol, aiadmk two leaves symbol, Chief Minister E Palaniswami, E Palaniswami, Election Commission AIADMK symbol, EPS OPS, EPS OPS wins two leaves, Jayalalithaa, Palaniswami, Palaniswami camp, Palaniswami wins aiadmk symbol, Panneerselvam, Sasikala, Sasikala AIADMK symbol, Tamil Nadu, Tamil Nadu Chief Minister E Palaniswami, Tamil Nadu politics, TTV Dhinakaran, TTV Dinakaran, Two Leaves, two leaves symbol

After months of infighting, the EPS-OPS faction of the AIADMK won back the party’s ‘Two Leaves’ symbol on Thursday, along with an approval from the Election Commission.

శశికళకు షాక్.. అధికారంలోని ఆ ఇద్దరే ఇక పార్టీకి రెండాకులు..

Posted: 11/23/2017 01:37 PM IST
Eps ops faction wins back aiadmk s two leaves symbol

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలకు.. ప్రస్తుతం స్థబ్దుగా వున్నాయి. అమ్మ తరువాత చిన్నమేనంటూ జనంలో ముద్ర వేసేందుకు ప్రయత్నించిన శశికళ వర్గానికి షాకుల మీద షాకులు ఎదురవుతున్న క్రమంలో మరో భారీ షాకిచ్చింది ఎన్నికల సంఘం. స్థబ్దుగా వున్న తమిళనాడు రాజకీయాల్లో ఇది మరో కీలక రాజకీయ పరిణామం.

రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే.. పార్టీ సింబల్ కోసం పోటీ పడుతున్నాయి. సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం ఓ వైపు.. శశికళ వర్గం మరోవైపు రెండాకుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. 23వ తేదీ గురువారం ఉదయం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం ప్రకటించింది. పళని – పన్నీర్ వర్గాన్ని అన్నాడీఎంకే వారసులుగా గుర్తించింది. అసలైన వారసులు వీళ్లే అని స్పష్టం చేస్తూ సింబల్ కేటాయించింది.

తమిళనాడు ప్రభుత్వం – శశికళ వర్గం వాదనలు విన్న ఎలక్షన్ కమిషన్.. అన్నాడీఎంకేలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాల కార్యదర్శులు ఎవరి వైపు ఉన్నారు అనేది లెక్క కట్టింది. వాళ్ల అభిప్రాయాలు తీసుకుంది. పూర్తి వివరాలు సేకరించింది. పార్టీ నుంచి శశికళ వర్గాన్ని శాశ్వతంగా బహిష్కరించాం అని.. వారికి జయలలిత స్థాపించిన పార్టీతో సంబంధం లేదని ప్రభుత్వం, పార్టీ తరపున గట్టిగా వాదించారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత అన్నాడీఎంకే పార్టీకి, జయలలిత వారసులు పళని – పన్నీర్ వర్గానిదే రెండాకుల గుర్తు అని ఎన్నికల సంఘం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aiadmk  party symbol  EPS  OPS  two leaves symbol  sasikala  dinakaran  politics  tamilnadu  

Other Articles