metro rail smart card bookings to begin మెట్రో స్మార్ట్ కార్డు ఇదే.. ఐటీ హాబ్లో తొలి కౌంటర్..

Hyderabad metro rail smart card bookings to begin at raheja mind space

nebula, hyderabad metro rail, smart card, raheja mind space, It sector, metro rail smart card, metro smart card booking begins, cost of metro smart card

hyderabad metro rail smart card bookings to begin in two days at raheja mind space counter, this is mamed as nebula smart card.

మెట్రో స్మార్ట్ కార్డు ఇదే.. ఐటీ హాబ్లో తొలి కౌంటర్..

Posted: 11/23/2017 12:52 PM IST
Hyderabad metro rail smart card bookings to begin at raheja mind space

హైదరాబాదీయుల స్వప్నం సాకారమవుతున్న వేళ.. మరికొన్ని గంట్లలో మెట్రో రైలులో ప్రారంభానికి సన్నాహాలు సర్వం సిద్దమైన క్రమంలో ఎప్పుడెప్పుడు ప్రయాణం చేద్దామా అంటూ ఎదురుచూస్తున్న ప్రయాణికుల కోసం మెట్రో రైలు కూడా ఇందుకు సంబంధించిన స్మార్ట్ కార్డుల అమ్మకాలకు సన్నహాలు చేస్తుంది. ఈ నెల 28వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభం అవుతుండటంతో.. స్మార్ట్ కార్డులను అందించేందుకు బుకింగ్స్ ఓపెన్ చేసింది.

వీటి విక్రయానికి తొలి ప్రాధాన్యం ఐటీ ఉద్యోగులకే కల్పిస్తున్నారు. ఐటీ కారిడార్ లోని ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నారు. రూ.200 విలువైన కార్డు మొదటగా అందిస్తారు. ఈ కార్డ్ ఉన్నవారు స్టేషన్ లోకి నేరుగా ఎంటర్ కావొచ్చు. టికెట్ కౌంటర్ దగ్గర స్వైపింగ్ చేసి రైలులోకి ఎక్కవచ్చు. దిగే స్టేషన్ దగ్గర బయట వచ్చే సమయంలో మళ్లీ స్వైపింగ్ చేస్తే ఇన్ అండ్ ఔట్ దూరానికి ఆటోమేటిక్ గా మీ కార్డు నుంచి టికెట్ డబ్బులు కట్ అవుతాయి.

హైదరాబాద్ ఐటీ హబ్ హైటెక్ సిటీలోని రహేజా మైండ్ స్పేస్ పార్క్ లోని 5A బిల్డింగ్ దగ్గర తొలి స్మార్ట్ కార్డు కౌంటర్ ను ను ఏర్పాటు చేశారు. ఇక మరో ఒకటి, రెండు రోజుల్లో స్మార్ట్ కార్డులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు రైల్వేస్టేషన్ కు వెళ్లి మరీ టికెట్ కొనుగోలు చేయకుండా.. వారు పనిచేస్తున్న చోటికి సమీపంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ కార్డులను నెబులా స్మార్ట్ కార్డ్ గా దీన్ని పిలుస్తున్నారు.

రాబోయే రోజుల్లో సిటీ వ్యాప్తంగా మరిన్ని స్మార్ట్ కార్డ్ జారీ చేసే కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికైతే కేవలం మియాపూర్ టు అమీర్ పేట్, అమీర్ పేట్ టు మెట్టుగూడ వరకే సేవలు అందుబాటులోకి రాగా, హైటె్ సిటీ వద్ద ఈ సేవలు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం వుంది. అయినా అక్కడే తొలి కౌంటర్ పెట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇక మెట్రో రైలు ప్రయాణికుల సౌకర్యార్ధం మెట్రో స్టేషన్ల టీ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలనే మెట్రో రైల్ నిర్వహణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మెట్రో రైల్వేస్టేషన్ల వద్ద నిరుద్యోగులు నిర్వహించుకునేలా ఫైబర్ తో టీ కప్పు ఆకారంలో రూపొందించిన చాయ్ డబ్బాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో చాయ్, కాఫీ, పాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, తినుబండారాలు విక్రయిస్తారు. అయితే వాటి ధర, నాణ్యత అంతా కూడా మెట్రో సంస్థ నియంత్రణలోనే వుండనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nebula  hyderabad metro rail  smart card  raheja mind space  It sector  booking begins  

Other Articles