government school teachers fight in mahaboobnagar బరితెగించిన బడిపంతుళ్లు.. విద్యార్థుల ఎదుటే..

Government school teachers fight in front of students in mahaboobnagar

food, electric rice cooker, school teachers, fighting, Government High School, hanwada, mahaboobnagar, telangana

government school teachers, whose duty is to make students discpline, fight in front of students in mahaboobnagar

బరితెగించిన బడిపంతుళ్లు.. విద్యార్థుల ఎదుటే..

Posted: 11/22/2017 05:59 PM IST
Government school teachers fight in front of students in mahaboobnagar

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన సర్కారీ బడిపంతుళ్లు.. వీధిన పడి పోరాడుతుంటే చూసినవాళ్లు ముక్కున వేలేసుకున్నారు. అయితే ఏదో జరగరానిది జరిగింది కాబోలు.. అందుకనే ఉపాధ్యాయులు ఇలా పోరాడుతున్నారనుకుంటే.. అసలు విషయం తెలిస్తే.. సర్కారీ పంతుళ్లు ఇంత చిన్న విషయానికి పోరాడుతున్నారా.. అంటూ నవ్విపోతారు. ఇందుకోసమా ఈ పంతుళ్లు.. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి బాహాబాహీకి దిగారు అన్న విస్మయం ఎదురుకాక తప్పదు.

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నత పాఠశాలలో పనిచేసే హిందీ పండిట్ నాగేష్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు చంద్యానాయక్, గణితం టీచర్ హన్మంతునాయక్, ఇంగ్లిష్‌ టీచర్‌ శ్రీనివాస్ రెడ్డి పాఠశాలలోనే వ్యక్తిగతంగా భోజనం తయారు చేయించుకునేవారు. ఇందుకోసం సొంతంగా సరుకులు తెచ్చుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ స్టౌ కూడా సమకూర్చున్నారు.

కొన్నాళ్లు ఇది బాగానే సాగిన బి య్యం, సరుకులు అయిపోవడంతో గొడవలు మొదల య్యాయి. ప్లేట్లు, ఇతర సామాగ్రిని తోటి వారికి తెలియ కుండా హిందీ పండిట్‌ నాగేష్‌ ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన మిగతా ఉపాద్యాయులు నాగేష్‌ను నిలదీశారు. ఆ తర్వాత నాగేష్‌ మిగతా వారితో కలిసేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ఇంతలో నాగేష్‌ వారు వం డుకునే ఎలక్ట్రిక్‌ స్టౌను పగలగొట్టాడు. విషయం తెలి యడంతో మిగతా ముగ్గురు ఆయనను ప్రశ్నించారు. ఈక్రమంలో మంగళవారం చంద్యానాయక్‌.. నాగేష్‌పై దాడి చేయడంతో గొడవ పెద్దదైంది. దీంతో మిగతా ఉపాధ్యాయులు సర్దిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles