Hyd metro announces do's and dont's for passengers మెట్రో ధరలపై కొరవడిన క్లారిటీ..ఇవి చేయకూడదండోయ్

Modi s visit confirmed to launch hyderabad metro at miyapur

Prime Minister Narendra Modi, PM modi, hyderabad metro rail, pm modi metro rail, miyapur, kukatpally, metro rail project, PM speial protection group, Prime Minister Office, PM Shedule, PM Hyderabad visit, telanagana

It’s official now. Prime Minister Narendra Modi will be launching the Hyderabad Metro Rail project at metro rail station at Miyapur on November 28.

మెట్రో ధరలపై కొరవడిన క్లారిటీ..ఇవి చేయకూడదండోయ్

Posted: 11/22/2017 12:47 PM IST
Modi s visit confirmed to launch hyderabad metro at miyapur

హైదరాబాద్ నగరవాసులు కల సాకారమవుతున్న సమయం రానే వచ్చింది. ఈ నెల 28న దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మెట్రోరైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లు ప్రధాని మోడీ మెట్రో రైలు ప్రారంభిస్తారా.? లేదా..? అన్న విషయంలో ఏర్పడిన సందిగ్థత నెలకొన్నా.. తాజాగా మాత్రం టూర్ పై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పష్టత వచ్చేసింది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం కూడా అందింది.

28న ముహూర్తం కుదిరిన మెట్రో సేవల ప్రారంభానికి ఫీఎంవో కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ లో పేర్కొనింది. ఢిల్లీ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్న ప్రధాని మూడు గంటలకు చేరుకోనున్నారు. ఆ తరువాత వెంటనే 3.25 నిమిషాలకు మియాపూర్ చేరుకుని మెట్రోరైల్ ప్రారంభిస్తారు. మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు రైలు లో ప్రయాణించి లాంఛనంగా ప్రారంభిస్తారు. తిరిగి మియాపూర్ చేరకుని ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు.

అ తరవాత మియాపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైటెక్ సిటీలోని హైటెక్ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల శిఖరాగ్ర సదస్సును ప్రారంభిస్తారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసే విందుకు హాజరై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అతిధ్యాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత ఎనమిదిన్నరకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని హస్తినకు చేరుకోనున్నారు.

మెట్రో ధరలపై కనరాని క్లారిటీ..

మెట్రో ప్రారంభోత్సం జరిగేందుకు ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే వుండగా, ఇంకా అధికారికంగా మెట్రో ధరల వివరాలు మాత్రం తెలియరాకపోవడంతో ప్రయాణికులు అందోళనకు గురవుతున్నారు. తొలిదశలో నాగోల్‌–అమీర్‌పేట, మియాపూర్‌– అమీర్‌పేట రూట్లలో మొత్తం 30 కి.మీ. మార్గంలో ప్రయాణానికి ముహూర్తం ఖరారైనా.. ఇంకా ధరల విషయంలో అధికారికంగా ఒక నిర్ణయానికి అధికారులు ఎందుకు రాలేకపోతున్నారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

అయితే అనధికారికంగా తెలిసిన వివరాల ప్రకారం మెట్రో రైలులో ప్రయాణించేందుకు కనీస చార్జీ రూ. 12.. గరిష్టంగా రూ. 20 ఉండే అవకాశం ఉంది. డే పాస్‌ ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు ఉండనుంది. చార్జీల విషయంలో ఉన్నతస్థాయి కమిటీ ఇంకా భేటీ కాలేదు. చార్జీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదని హెచ్‌ఎంఆర్‌ అధికారులు తెలిపారు. చార్జీలు, పార్కింగ్‌ రుసుములపై అధికారిక ప్రకటనకు రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రారంభోత్సవం దగ్గర పడుతున్నప్పటికీ మెట్రో చార్జీల ప్రకటన అంశంపై హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తోంది.

మెట్రో స్మార్ట్‌ కార్డు ధర రూ.100 కాగా.. కనీస రీచార్జి మొత్తం మరో రూ. 100 అంటే మొత్తంగా రూ. 200కి మెట్రో స్మార్ట్‌కార్డు లభిస్తోంది. దీనిని నెబ్యులా స్మార్ట్‌ కార్డ్‌ అంటారు. దీనిని గరిష్టంగా రూ.2 వేల వరకు రీచార్జి చేసుకోవచ్చు. ఈ కార్డును ఎక్కే, దిగే స్టేషన్ల దగ్గర ఉండే ఆటోమెటిక్‌ టికెట్‌ కలెక్షన్‌ గేట్ల దగ్గర స్వైపింగ్‌ చేస్తేనే స్టేషన్ లోకి ఎంట్రీ లభిస్తోంది. ఈ కార్డులు మెట్రో స్టేషన్లు, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. తొలిదశలో ఈ కార్డు మెట్రో జర్నీకి మాత్రమే పనిచేస్తుంది. తర్వాత ఈ కార్డుతో క్యాబ్‌లు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, మెట్రో స్టేషన్లు, మాల్స్‌లో షాపింగ్‌ తదితర 16 రకాల సేవల వినియోగానికి వాడుకునే సౌలభ్యం కల్పిస్తారు.

ఇక మెట్రో రైళ్లు, స్టేషన్లలో ఏం చేయకూడదో తెలుసా.?

    రైల్లోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయరాదు
    రైళ్లలో ఆహారం, తినుబండారాలు తీసుకోకూడదు
    పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదు
    ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాలడం... వాటి కదలికను ఆపడం చేయరాదు
    స్టేషన్ పరిసరాల్లోని నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు
    రైలు కోసం వేచి ఉన్నప్పుడు పసుపురంగు లైన్ దాటరాదు
    రైలు ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయరాదు
    డోర్లకు ఆనుకుని నిల్చోరాదు
    రైలు కోసం ప్లాట్ ఫామ్ పై పరుగెత్తరాదు
    స్టేషన్ పరిసరాలు, బోగీల్లో ఉమ్మి వేయడం, ధూమపానం చేయడం, పాన్ నమలడం చేయరాదు. ఆల్కహాల్ సేవించరాదు.
    చిన్నారులను స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్ ఫామ్ పై వదిలేయరాదు
    మెట్రో స్టేషన్ పరిసరాల్లో వీధి వ్యాపారాలు నిషేధం
    బోగీలకు నోటీసులు అంటించరాదు
    ఎవరైనా సరే తమ స్మార్ట్ కార్డును లేదా టోకెన్ ను ఇతర ప్రయాణికులతో పంచుకోరాదు
    బోగీ డోర్లు తెరుచుకునే లేదా మూసుకునే సమయంలో వాటి మధ్య నిల్చోరాదు
    అత్యవసర కమ్యూనికేషన్ సాధనాలతో వైద్యపర సేవలు అవసరమైనప్పుడే డ్రైవర్ తో సంభాషించాలి.
    పై షరతులు, నిబంధనలకు కాదని ప్రవర్తిస్తే... కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi  hyderabad metro rail  PM Shedule  PM Hyderabad visit  telanagana  

Other Articles