Delhi FSL confirms nithyananda in sex tape రంజితతో రాసలీలలు జరిపింది నిత్యానందే

Delhi fsl confirms nithyananda in sex tape

controversial godsman, nithyananda swami, actress ranjitha, sex cd, nithyananda sex video, delhi fsl, maa anandamayi

Delhi FSL confiremd that the man in the controversial sex cd is Nithyananda swamy. NIthyanda's cd recorded by his car driver Lenin in 2011. after the CD released to media it creats very big conteroversy.

ITEMVIDEOS: రంజితతో రాసలీలలు జరిపింది నిత్యానందే

Posted: 11/22/2017 02:54 PM IST
Delhi fsl confirms nithyananda in sex tape

వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద.. మాతా అనందమయిగా అవతరించిన నటి రంజితలకు చెందిన రాసలీలల వీడియో బయటకు వచ్చిన తరువాత నుంచి ఆయన చిక్కులను ఎదురవుతూనే వున్నాయి. తన వరకు వచ్చిన ఫీఠం కూడా దూరమైంది. నటి రంజితతో కలిసి సన్నిహితంగా మెలుగుతూ పడకగదిలో సేవలు చేయించుకున్న.. రాసలీలలకు సంబంధించిన వీడియో టేపులలో ఉన్నది తాను కాదంటూ అదంతా మార్ఫింగ్ అంటూ కొట్టిపారేస్తూ వచ్చిన వివాదం ఎట్టకేలకు స్వామి నిత్యానంద మెడకు చుట్టుకుంది.

ఈ రాసలీలల వీడియోలో వున్నది స్వామి నిత్యానందానేని, ఆయన అరోపిస్తున్నట్లు వీడియోలో మార్ఫింగ్ కు అవకాశమే లేదని, ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ స్పష్టం చేసింది. ఇన్నాళ్లు మార్ఫింగ్‌ జరిగిందంటూ నిత్యానంద చేసిన వాదనను ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు తోపిపుచ్చారు. ఆ సీడీల్లో ఉన్నది నిత్యానందేనని ధ్రువీకరిస్తూ... ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చిన ఓ నివేదిక ఇవాళ వెలుగులోకి వచ్చింది.

2010లో స్వామి నిత్యానంద రాసలీలల సీడీని ఆయన కారు డ్రైవర్‌ లీక్‌ చేయడంతో... ఆ దృశ్యాలు మీడియాతో పాటు, సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌  చేసిన విషయం తెలిసిందే. అయితే తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఈ భక్తి మార్గంలో అనుసరించాల్సిన సాములోరు ఇలా రాసలీలల మార్గం అనుసరిస్తున్నారా..? అంటూ భక్తులు విమర్శలు కూడా చేశారు.

కాగా ఇప్పటికే నిత్యానందపై పలు కేసులు నమోదు అయిన విషయం విదితమే. అంతేకాకుండా నిత్యానంద తనపై అత్యాచారం చేశారంటూ ఆరతీరావ్‌ అనే శిష్యురాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2010 సంవత్సరంలో ఆయనపై రేప్‌ కేసు నమోదు అయింది. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని,  అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకూడదన్న నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలకు ఆయన అంగీకరించకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించిన విషయం కూడా తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithyananda swami  actress ranjitha  sex cd  nithyananda sex video  delhi fsl  maa anandamayi  

Other Articles