Qatar's redience permit system made easy and simple భారతీయులకు ఖతార్ గుడ్ న్యూస్..

Qatar s redience permit system made easy and simple

Qatar, residence permit, indians, pakistanis, bangaldesh, philippines, indonesia, sri lankans, tunishians, qatar news agency, latest news

Steps taken by Qatar this year to simplify residence permit to eight countries including india, where they can fulfill all the necessary documents in thir home country making residence permit procedures “easy and simple”

భారతీయులకు ఖతార్ గుడ్ న్యూస్..

Posted: 11/22/2017 09:41 AM IST
Qatar s redience permit system made easy and simple

పొట్టచేత పట్టుకుని విదేశాలకు వలస వెళ్లిన కార్మికులకు ఖతార్‌ గుడ్ న్యూస్‌ చెప్పింది. తమ దేశంలో ఉద్యోగం చేయాలని భావించే అశావహుల కోసం వేచివున్న విదేశీ కార్మీకుల నివాస ప్రక్రియలను ఖతార్ సులభతరం చేసింది. కార్మికులు ఈ మేరకు తమ స్వదేశంలోనే విధానాలన్నింటిన్నీ పూర్తి చేసుకునే వీలు కల్పించింది. ఈ కొత్త ఒప్పందంపై ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సింగపూర్ కు చెందిన కంపెనీ సంతకాలు చేసుకున్నాయి. ఖతారీ నివాస ప్రక్రియలన్నింటిన్నీ విదేశీ వర్కర్లు తమ స్వదేశంలోనే పూర్తి చేసుకునే వెసలుబాటును కల్పించింది.

ఈ మేరకు ఖతార్‌ న్యూస్‌ ఏజెన్సీ వివరాలను వెల్లడించినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో ఎనిమిది దేశాలకు వర్తింపజేసింది. భారత్‌, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, ట్యునీషియాలు ఉన్నాయి. ఖతార్‌ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఈ దేశాల వారు 80 శాతం ఉంటారు. దీంతో ఆయా దేశాల నుంచి ఖతార్ వెళ్లేందుకు అసక్తి చూపేవారు ఇకపై స్వదేశంలోనే తమ సంబంధిత డాక్యుమెంట్లను పొందపర్చే అవకాశాన్ని కల్పించింది

ఈ ఓప్ప్ందం ప్రకారం విదేశీయులు తమ మెడికల్‌ చెకప్‌, బయోమెట్రిక్‌ డేటా, ఫింగర్‌ప్రింట్‌, వర్క్‌ కాంట్రాక్టులపై సంతకం అన్ని కూడా ఖతార్‌కు రాకముందే తమ స్వదేశంలోనే పూర్తి చేసుకునే అనుమతి ఉంటుంది. ఈ డీల్‌తో మెడికల్‌ టెస్ట్‌లో విఫలమయ్యారని విదేశీ వర్కర్లను దేశంలోకి తిరస్కరించే కేసులు తగ్గుతాయని తెలిసింది. అక్టోబర్‌ మొదట్లోనే ఖతార్‌ ఈ డ్రాఫ్ట్‌ బిల్లును రూపొందించింది. విదేశీ వర్కర్లు తమ ఉద్యోగులు మారడానికి వీలుగా గతేడాదే ఖతార్‌ ప్రభుత్వం కొత్త లేబర్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Qatar  residence permit  indians  qatar news agency  latest news  

Other Articles