వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి టీడీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మోహన్ రెడ్డి గన్ మెన్లను తొలగించింది. శిల్పాతో పాటుగా నంద్యాల మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన గన్ మెన్లను తొలగిస్తూ ఇవాళ అదేశాలు తీసుకుని తక్షణం వాటిని అమలుపర్చారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గన్మెన్ల తొలగింపుపై వైసీపీ అధినేత జగన్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న తరుణంలో శిల్పా మోహన్‌రెడ్డి గన్మెన్లను తొలగించడంపై జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి మోహన్‌రెడ్డి టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచారు. భూమా మరణం తర్వాత నంద్యాల నియోజక వర్గానికి ఉప ఎన్నిక వచ్చింది.
వైసీపీ నంద్యాల అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి ఖరారు కావడంతో ఆయన వైసీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్న బాటలోనే నడిచి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన చక్రపాణిరెడ్డి ఈ పార్టీ ద్వారా తనకు లభించిన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, విజయం సాధించారు.
(And get your daily news straight to your inbox)
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more
May 24 | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా... Read more
May 24 | నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా... Read more
May 24 | వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు..... Read more
May 24 | అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు... Read more