Former Mumbai Model Accuses Muslim Husband of ‘Love Jihad’ లవ్ జిహాద్ కు ఈ మోడల్ ప్రత్యక్ష ఉదాహరణ

Former mumbai model accuses muslim husband of love jihad

rashmi shahbazker, mumbai love jihad, love jihad case, mumbai love jihad case, former mumbai model alleges,muslim,news,latest top news,update,bollywood,entertainment,latest

A former model based in Mumbai has alleged that her Muslim husband pressurised her to convert to Islam after marriage.

లవ్ జిహాద్ కు ఈ మోడల్ ప్రత్యక్ష ఉదాహరణ

Posted: 11/18/2017 07:33 PM IST
Former mumbai model accuses muslim husband of love jihad

లవ్‌ జిహాద్‌ అన్నది నిజంగా వుందా..? ప్రేమగా పెళ్లి చేసుకున్నవాళ్ల మధ్య వేధింపులు ఎందుకు వస్తాయన్న అనుమానాలు రేగినా.. లవ్ జీహాద్ అన్నది వున్నదని సాక్ష్యం కూడా తెరపైకి రావడం కలకలం రేపుతోంది. ఈ వేదింపులు ఎదుర్కోన్నది ఏకంగా ఒకనాటి మోడల్ కావడం కూడా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... 13 ఏళ్ల క్రితం ముంబైకి చెందిన రష్మీ (42) మోడలింగ్ లో రాణించే సమయంలో ముస్లిం మతానికి చెందిన ఆసిఫ్ (47) ను వివాహం చేసుకుంది. వివాహం సమయంలో ఎవరి మతాచారాలు వారివని, ఒకరి మతాచారాలకు మరొకరు అభ్యంతరం చెప్పకూడదన్న అంగీకారంతో వివాహం జరిగింది.

అయితే, గత కొంత కాలంగా ముస్లిం మతాచారాలు ఆచరించాలంటూ భర్త ఆమెను ఒత్తిడి చేయడం ఆరంభించాడు. దానిని తాను తిరస్కరించడంతో, మరో మహిళ (28)ను వివాహం చేసుకోవడమే కాకుండా, తన ఏడేళ్ల కుమారుడ్ని తనకు ఇవ్వకుండా, తన దగ్గరే ఉంచుకుని తనకు కాకుండా చేశారని ఆమె భర్తపై ఆరోపణలు చేసింది. ఇప్పుడు తన కుమారుడు తనను రాక్షసిని చూసినట్టు చూస్తున్నాడని ఆమె కన్నీరుమున్నీరైంది.

ఇప్పుడు తన భర్త వివాహం చేసుకున్న మహిళ తన సోదరుడి గర్ల్ ఫ్రెండేనని ఆమె తెలిపింది. తొలుత ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భర్త, తర్వాత ఆమెను వివాహం కూడా చేసుకున్నాడని ఆరోపించింది. తన భర్త, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 354, 323, 324, 504, 506 మరియు 34ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rashmi shahbazker  mumbai love jihad  love jihad case  mumbai love jihad case  

Other Articles