Uber driver attacks passenger at airport ప్రయాణికులపై చేతివాటం.. పోషించేవాడిపైనే దౌర్జన్యం..

Man allegedly beaten up by uber drivers for insisting on seat belt

Dave Banerjee, Bengaluru passenger, uber driver, Uber driver attacks passenger, bangalore, karnataka, crime

Dave Banerjee, a Bengaluru resident, arrived at the airport from Mumbai and booked a cab at around 9 PM. When Banerjee entered the cab, he quizzed the driver about the seatbelt and asked him to stop.

ప్రయాణికులపై చేతివాటం.. పోషించేవాడిపైనే దౌర్జన్యం..

Posted: 11/15/2017 11:38 AM IST
Man allegedly beaten up by uber drivers for insisting on seat belt

ఏ వ్యాపారమైనా సరే.. కస్టమర్లు వెళ్లకపోతే అది మనుగడ సాగించడం కష్టమే.. అందుకనే వినయోగదారుడే భారతీయ మార్కెట్లో దేవుడిగా వ్యాపారవేత్తలు భావించాలని జాతిపిత మహాత్మగాంధీ చెప్పిన విషయాన్ని మొన్నటికి మొన్న ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ విమాన సంస్థ పెడచెవిన పెట్టగా.. తాజాగా టాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్‌ కూడా అదేబాటలో పయనించింది. సీటు బెల్టు పెట్టుకొమ్మని పదే పదే విన్నవించినందుకు ఏకంగా వినియోగదారుడిపైనే ముష్టిగాతాలకు ఉబర్ టాక్సీ డ్రైవర్ తెగబడ్డాడు. ఉబర్ డ్రైవర్లు అందరూ కలసి మూకుమ్మడిగా ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు.

బాధితుడు దావే బెనర్జీ తనపై జరిగిన దాడి ఉబర్ కాల్ సెంటర్ కు పిర్యాదు చేసినా.. అక్కడి సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు, సరికదా.. ఈ విషయంలో తామేమి చేయలేమని, ఈ విషయంతో ప్రయాణికులు పోలీసులను అశ్రయించవచ్చునని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రయాణికుడు బెనర్జీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దాదాపు 20మంది ఉబెర్ డ్రైవర్లు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారంటూ ట్విట్టర్ లో ఫోటోలను పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఈ  ఘటనపై ఉబెర్‌ యాజమాన్యం.. పోలీసులను అశ్రయించమని నిర్లక్ష్యంగా బదులిచ్చిందని ఆరోపించారు.

తాను ముంబై నుంచి విమానంలో రాత్రి 9 గంటలకు తన స్వస్థలం బెంగళూరు చేరుకున్నానని, అక్కడనుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబెర్‌ బుక్‌ చేసుకున్నానని చెప్పారు. కారు వెనకు సీటులో సీట్ బెల్ట్ లేకపోవడాన్ని గమనించి  ఉబెర్ డ్రైవర్ ని ప్రశ్నించానని చెప్పారు.  రెండుసార్లు అడిగినా సమాధానం లేకపోవడంతో  ఆయన..డ్రైవర్ ని భుజంతట్టి ..కారు ఆపమని కోరారు. అంతే ఆగ్రహంతో ఊగిపోతూ కారు దిగిన క్యాబ్  డ్రైవర్ ఇతర డ్రైవర్లను పిలిచి మరీ బెనర్జీపై దాడికి పాల్పడ్డారు.  20మంది  డ్రైవర్లు సుమారు 40 నిమిషాలపాటు తమ అఘాయిత్యాన్ని కొనసాగించారు. ఎట్టకేలకు వారినుంచి బయటపడి  మరో క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఇంటి చేరానని బెనర్జీ చెప్పుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles