egg price in india climbs higher కొండెక్కిన కోడిగుడ్డు.. పిల్ల కన్నా తల్లే సో బెటరూ..!

Egg price in india climbs higher better to have hen

hen, chicken, egg, cock, eggeritian, vegeterian, egg price climbs high, egg price in hyderabad, egg price in telanagana, latest news

As winter season plunging everybody wants to become eggeritan as its cheap and best to have some thing which makes our body to resist cold. hence the egg prices climb more higher than hen.

కొండెక్కిన కోడిగుడ్డు.. పిల్ల కన్నా తల్లే సో బెటరూ..!

Posted: 11/11/2017 12:34 PM IST
Egg price in india climbs higher better to have hen

రోజుకో గుడ్డు తినండి.. మీ దేహాన్ని అనారోగ్యం దరి చేయనీయకుండా చేసుకోండని జాతీయ గుడ్డు కార్పోరేషన్ ఇచ్చే ప్రకటనలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది వెజ్ టేరియన్లు. ఎగ్గేరిటన్లుగా మారుపోతున్నారు. దీంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో గతంలో ఎన్నడూ లేనంతగా కోడి గుడ్డు ధర ఎత్తుకు ఎగిసింది. దీనికి తోడు శీతాకాంలో గుడ్డ తింటే చలి నుంచి తట్టుకునే అవకాశముంటుందని కూడా గుడ్డుకు డిమాండ్ పెరిగింది.

ప్రతికూల పరిస్థితులు, వ్యాపార ఒడిదుడుకులు ఉత్పత్తి తగ్గడానికి కారణమైనప్పటికి..గతంలో కంటే గుడ్డు వినియోగదారుల సంఖ్య పెరిగింది. ఇది మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం హోల్ సేల్ లో గుడ్డు ధర రూ.4.70 కాగా.. రిటైల్ మార్కెట్లో రూ.5.30.. చిల్లరగా గుడ్డు ఒక్కొక్కటీ రూ.6 లకు అమ్ముతున్నారు. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇక దీనికి తోడు రాష్ట్రం మొత్తం మీద ప్రతిరోజూ సగటున నాలుగు కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. మూడు కోట్ల వరకూ వినియోగం ఉంటుంది.

ఒక్క హైదరాబాద్ లోనే రోజుకు సగటున 1.20 కోట్ల గుడ్ల వరకు డిమాండ్ ఉంటుంది. శివారు ప్రాంతాల్లోని పౌల్ట్రీల నుంచి అత్యధికంగా గుడ్లు నగరానికి సరఫరా అవుతాయి. అయితే మూడేళ్లుగా పౌల్ట్రీ వ్యాపారం బాగా దెబ్బతింది. కోళ్లకు రోగాలు రావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వ్యాపారులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద నోట్ల రద్దు పౌల్ట్రీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రజల వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా గుడ్ల వినియోగం తగ్గింది. అప్పుడు గుడ్డు ధర కూడా పడిపోయింది.

చిన్న వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయి ఉత్పత్తికి దూరమయ్యారు. దీంతో ఉత్పత్తి సగం పడిపోయింది. ఇదిలా ఉండగా మార్కెట్లో మాత్రం గుడ్డు వినియోగం పెరిగింది. గతంలో అంగన్ వాడీ కేంద్రాల్లో వారానికి మూడుసార్లు గుడ్లు అందిస్తే.. ఇప్పుడు ప్రతిరోజు అందిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో గుడ్డు తప్పనిసరి చేశారు. దీంతో వీటి వినియోగం అధికమైంది. కానీ మార్కెట్లో డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో గుడ్డు ధర రెక్కలొచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles