wouldbe bride dies in road mishap in saroornagar పెళ్లింట్లో చావు డప్పు.. విధి వంచనంటే ఇదేనా.?

Wouldbe bride dies in road mishap in saroornagar

geeta, wouldbe bride, wedding shoping, khammam, hyderabad, saroornagar, road mishap, accident, yamaha bike, lorry, rachakonda police, telangana, crime latest news

A khamman wouldbe bride geeta, who came for wedding shoping to hyderabad saroornagar, met with an accident and died while returning home after shopping.

పెళ్లింట్లో చావు డప్పు.. విధి వంచనంటే ఇదేనా.?

Posted: 11/11/2017 11:32 AM IST
Wouldbe bride dies in road mishap in saroornagar

విధి వంచించింది. కాబోయే పెళ్లికూతురును హైదరాబాద్ మహానగర రోడ్డుపై వెనుకగా వచ్చిన మృత్యుశకటం కబళించింది. మరికోన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో తీరని విషాదం నింపింది. ఎన్నో వ్యయప్రయాసలు పడి కూతరు పెళ్లి ఏర్పాటు చేస్తున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. పక్షంరోజుల తరువాత వినిపించాల్సిన వివాహ మంత్రోచ్చరణలకు బదులు అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేసేలా చేసింది. చావు డబ్బు కొట్టించింది.

పెళైన తరువాత అత్తారింటికి సాగనంపాల్సిన కూతురిని.. తిరిగిరాని లోకాలకు పంపాల్సి రావడంతో బందువులు, పరిచయస్తులు శోకసంద్రంతలో మునిగారు. తల్లిదండ్రులు, బంధువులు ఏడుపు చూసిన స్థానికులు కూడా కంటతడి పెట్టుకున్నారు. వివాహ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆమె రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోడంతో మృతురాలి ఇంటి వద్ద విషాధఛాయలు అలుముకున్నాయి. కాగా, సరూర్ నగర్ పరిధిలోని కొత్తపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లాకు చెందిన 21 ఏళ్ల గీత కుటుంబసభ్యులతో కలిసి వివాహ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చింది. కొత్తపేటలోని ఓ దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేసిన అనంతరం ఆమె కుటుంబసభ్యులతో కలిసి యమహా బైక్‌పై వెళుతుండగా.. టిప్పర్‌ వాహనం​వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో గీత అక్కడికక్కడే మృతిచెందింది. ఈ నెల 24న గీత వివాహం కానుంది.

వివాహ వస్త్రాల కోసం కుటుంబంతో సహా నగరానికి వచ్చామని, మరో పది రోజుల్లో పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన తమ కూతురుని మృత్యువు కబళించిందంటూ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రిదండ్రుల దుఃఖం చూపరులను కలిచివేసింది. ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  AirAsia staffer  Bengaluru  bengaluru airport  misbehaviour  rape  sexual harassment  

Other Articles

Today on Telugu Wishesh