Woman says AirAsia staff 'abused, manhandled her' ఆ బాటలోనే ఎయిర్ ఏషియా.. మహిళతో అసభ్యప్రవర్తన

Airasia airline staff harass woman passenger

AirAsia, AirAsia Staff, Bengaluru, Bengaluru Airport, AirAsia Staff Harassment, Misbehaviour, Sexual Harassment

A 28-year-old woman accused three AirAsia employees of allegedly misbehaving with her on November 3 on-board a Bengaluru-bound flight from Ranchi.

ఆ బాటలోనే ఎయిర్ఏషియా.. మహిళతో అసభ్యప్రవర్తన

Posted: 11/11/2017 10:44 AM IST
Airasia airline staff harass woman passenger

ప్రైవేటు ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్వాకం పట్ల యావత్ దేశం విస్మయం వ్యక్తం చేస్తూన్న అలాంటి ఘటనలు మాత్రం పునారవృతం కాకుండా అగడం లేదు. ఓ మధ్యవయస్కుడైన ప్రయాణికుడితో దారుణంగా వ్యవహరించి, కిందపడేసి పిడిగుద్దులతో తెగబడిన సిబ్బంది వైనం వెలుగుచూసిన క్రమంలో మిగతా విమానసంస్థలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తాయని అనుకుంటే పోరబాటే. ప్రయాణికులతో అమర్యాదగా, అసభ్యకరంగా వ్యవహరించడంలో మేమంతా ఒక్కటే అన్నట్లు వుంది విమానసంస్థల తీరు.

ఇతర విమానసంస్థలకు తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా వ్యవహరించింది ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ. ఏకంగా మహిళా ప్రయాణికురాలిపై విమానాశ్రయంలోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఎయిర్‌లైన్‌ సిబ్బంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పైలెట్ సహా ఇద్దరు సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఈ నెల‌ 3న తాను రాంచీ నుంచి బెంగళూర్‌కు ఏయిర్‌ ఏషియా విమానంలో ప్రయాణించాన‌ని బాధిత యువ‌తి చెప్పింది. విమానం టేకాఫ్‌ తీసుకునే సమయంలో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయమని సిబ్బంది చెప్ప‌డంతో తాను చేశాన‌ని తెలిపింది.

అయినప్పటికీ పైలెట్ తో పాటు ఇద్ద‌రు సిబ్బంది త‌న‌ను అసభ్యపదజాలంతో దూషించారని ఆరోపించింది. త‌న‌ను విమానం నుంచి దించేస్తామని కూడా బెదిరించారని పేర్కొంది. బెంగళూరులో ఆ విమానం ల్యాండ్‌ కాగా ప్రయాణికులందరినీ పంపించి, తనను మాత్రం అడ్డుకున్నారని చెప్పింది. పైలెట్ కు క్షమాపణలు చెబితేనే వెళ్లనిస్తామని బెదిరించార‌ని వివ‌రించింది. ఒక‌వేళ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని అరోపించింది.

బయటకు వెళ్లనీయమని విమానంలో తనను అడ్డుకుని పట్టుబట్టారని, అయితే తానెం తప్పు చేయలేదని తానెందుకు క్షమాపణలు కోరాలని నిలదీసింది. అయినా వినని సిబ్బంది తనను అడ్డుకోవడంతో అక్కడికి వచ్చిన తన స్నేహితురాలి సాయింతో తాను చాలా సేపటికి బయటపడ్డానని తెలిపింది. ఇక  స్నేహితురాలి సాయంతో ఎయిర్ ఏషియా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై ఎయిర్ ఏషియా యాజమాన్యం మాత్రం తామేం తప్పచేయలేదని బుకాయిస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  Bengaluru Airport  Harassment  

Other Articles