High Court keeps telangana TRT exam on hold ఉఫాద్యాయ నియామక పరీక్షలకు బ్రేక్..

High court keeps telangana trt exam on hold

tspsc, trt 2018, tspsc.gov.in, tspsc trt 2018, high court, presidential orders, trt exams, johs, teacher jobs, telangana, telangana trt, trt, tet, jobs, govt jobs, telangana jobs, job alert, teacher jobs, teacher recruitment

After Government announcement of Teacher Recruitment Test (TRT) the HIGH Court keeps it in holds asking how can the government conduct exams taking 31 districts in perview as presidential orders covers only for old 10 districts.

ఉపాధ్యాయ నియామక పరీక్షలకు బ్రేక్..

Posted: 11/10/2017 10:51 AM IST
High court keeps telangana trt exam on hold

ఉపాధ్యయ నియామక పరీక్షలకు బ్రేక్ పడింది. గత కొన్నేళ్లుగా ఎంతో అసక్తిగా అశాహహులు ఎదురుచూస్తున్న ఈ పరీక్షలలో అది నుంచి వ్యక్తమవతున్న ప్రశ్నలనే వేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పరీక్షలను నిలిపివేయాలని మౌఖిక అదేశాలను జారీ చేసింది. ప్రశ్నించింది దీంతో ఉపాద్యయ నియామక పరీక్షలకు సిద్దమవుతున్న ప్రభుత్వానికి చుక్కెదురైంది. టీఆర్టీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలలో ప్రభుత్వ చేసిన పోరబాటునే హైకోర్టు ఎత్తిచూపింది.

అసేలాంటా పొరబాటు అంటే.. తెలంగాణలో ఉపాద్యాయ నియామకాలు చేపట్టనున్న క్రమంలో అవి రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే వుండాల్సిన అవసరం వుంది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం తెలంగాణలో నియామకాలు జరపాల్సిన అవసరమున్న క్రమంలో అవి 10 జిల్లాలకే పరిమితం కావాలని రాష్ట్రపతి ఉత్తర్వులలో పోందుపర్చగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాజాగా ఏర్పాటు అయిన 31 జిల్లాల ప్రాతిపదికన టీఆర్టీ పరీక్షలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీంతో తమ పాత జిల్లాలోనే తాము ఇప్పుడు నాన్ లోకల్ అవుతున్నామని, దీంతో టీఆర్టీ నోటిఫికేషన్ ను సవరించి.. పాత జిల్లాల ప్రతిపదికనే పరీక్షలను ఏర్పాటు చేసి.. ఉద్యోగ నిమాయకాలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అదేశించాలని కోరుతూ కోందరు అశావహులు న్యాయస్థానాన్ని అశ్రయించారు. దీంతో వారి పిటీషన్ ను పరిశీలించిన న్యాయస్థానం రాష్ట్రపతి ఉత్తర్వులు పది జిల్లాలకే పరిమితం కాగా, కొత్తగా ఏర్పాటు చేసిన 31జిల్లాల ప్రాతిపదికన టీఆర్టీ నియామకాల నోటిఫికేషన్ ఎలా విడుదల చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

గత అక్టోబరులో 10జిల్లాల ప్రాతిపదికనే ఫారెస్ట్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్లు ఇచ్చి TRT నోటిఫికేషన్ మాత్రం 31జిల్లాల ప్రకారం ఎలా ఇస్తారని నిలదీసింది. ఈ విధానం అములు చేయడంతో.. 31జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తే ఎంతో మంది అభ్యర్థులు పాత జిల్లాలో నాన్‌లోకల్‌ అవుతారని అభిప్రాయపడింది. ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకు టీఆర్టీ నోటిఫికేషన్‌పై ముందుకెళ్లొద్దని మౌఖికంగా ఆదేశించింది. ఈ దరఖాస్తులలో అభ్యర్థులు తమ పాత జిల్లాను తెలిపే కాలంను చేర్చా అవకాశం ఉందా అన్న విషయాన్ని పరిశీలించాలని సూచించింది. స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి.. దరఖాస్తు నమూనాను సమర్పించేందుకు సోమవారం వరకు గడువు కోరడంతో విచారణను నవంబర్ 13కు హైకోర్టు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tspsc  high court  presidential orders  trt exams  johs  teacher jobs  telangana  

Other Articles