Janasena Party Confirmed Pawan contest from Anantapur | పవన్ కళ్యాణ్ పోటీపై జనసేన పార్టీ మరో క్లారిటీ

Pawan kalyan contestant from anantapur

Janasena Party, AP Assembly Elections, Pawan Kalyan, Anantapur, Janasena Party Anantapur, Pawan Kalyan Two Places 2019 Elections, Jana Sena Party Vice President Mahendar Reddy, Mahendar Reddy Pawan Kalyan

Janasena Party Confirmed Pawan contest from Anantapur. Jana Sena Party Vice President Mahendar Reddy Clarified it.

పవన్ పోటీపై జనసేన మరో క్లారిటీ

Posted: 11/10/2017 09:11 AM IST
Pawan kalyan contestant from anantapur

టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గతంలోనే అనంతపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కాగా, ఇప్పుడు మరోసారి పార్టీ ఆ విషయాన్ని ధృవీకరించింది.

తమ అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల్లో దిగబోతున్నారని పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జనసేనలో పవన్ ఒక్కరు మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాట శిలాశాసనం అని.. ఆ మేరకే నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు.

డిసెంబర్ తొలివారం(7వ తేదీ) తరువాత తన పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నారని మహేందర్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తామని తెలిపారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేసే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ తాజా ప్రకటనతో మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టిసారించబోతున్నట్లు స్పష్టమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles