TTD revises rates to keep hotels in check వెంకన్న కొండకు పోవచ్చు మళ్ల.. కాకుండా జేబు గుళ్ల

Big relief to devotees ttd impliment fixed rates after high courts order

tirumala, TTD officials, big relief, high court, hotels, big hotels, tirumala tirupathi devasthanam, eatables, hotels, fixed rates, hotels fleecing devotees

tirumala devotees gets big relief with ttd officials action on high courts interference on the prices of eatables at tirumala tirupathi

వెంకన్న కొండకు పోవచ్చు మళ్ల.. కాకుండా జేబు గుళ్ల

Posted: 11/09/2017 03:01 PM IST
Big relief to devotees ttd impliment fixed rates after high courts order

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు స్వామి వారి దర్శనం కాకుండానే అక్కడి హోటల్ యాజమాన్యాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. హోటళ్ల నిలువుదోపిడీపై ప్రజాసంఘాలు వేసిన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేశాయి. దీంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కొండమీద వివిధ హోటళ్లలో అడ్డగోలు ధరలకు భక్తులు నిలుపు దోపిడీకి గురికాక తప్పని పరిస్థులేర్పడ్డాయి. పెద్ద హోటళ్లే కాదు.. చివరకు చిన్న చిరు దుకాణాల్లోకి వెళ్లినా.. భక్తులు జేబులు గుళ్ల కావాల్సిందే. దీంతో తిరుమల కోండకు రావడం కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న పనైపోయింది.

హైకోర్టు ఈ నెల తొలినాళ్లలో ఓ పిటీషన్ విచారించి.. ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓనే న్యాయస్థానానికి రావాల్సిందిగా సమన్లు జారీ చేయడంతో.. అఘమేఘాల మీద పరుగులు పెట్టిన టీటీడీ ఈ వో జే శ్రీనివాసరాజు.. పెద్ద హోటళ్ల నుంచి చిరుతిళ్ల దుకాణాల వరకు అందరినీ పిలిచి సమావేశపర్చి.. ఇకపై తిరుమలలో ఫిక్సిడ్ రేట్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో రూ.30 పలికిన రెండు ఇడ్లీలు ఇక రూ.7 దర పలకనున్నాయి. ఇలా అన్ని పలహారాలు, బోభనాలపై కూడా రేట్లు తగ్గిపోయాయి. ఈ ధరలను పట్టిక రూపంలో ప్రతీ దుకాణం వ్దద వుంచాలని, లేనిపక్షంలో దుకాణదారులపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చిరించారు.

తిరుమలలో సామాన్య భక్తులకు సాంత్వన చేకూరేలా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో హోటల్‌ యజమానులు అధిక ధరలను తగ్గించాలని, ఆయా ధరల పట్టికలను హోటళ్ల ముందు అందరికీ కనిపించేలా వేలాడదీయాలని, దీన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం తిరుమలలోని ప్రతి చిన్న హోటల్‌లోనూ ధరల తగ్గి, పట్టికలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పట్టికలో వున్న రేట్ల కంటే ఎక్కువ ధరకు అమ్మితే... ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించేలా ఫోన్‌ నెంబర్లు వేస్తున్నారు. దీంతో వెంకన్న భక్తులు తిరుపతి కోండకు పోవచ్చు మళ్లి.. కాకుండా జేబులు గుళ్ల అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala  TTD officials  big relief  high court  hotels  eatables  hotels  fixed rates  

Other Articles