swamiji faces ire from lord shiv devotees అహం బ్రహ్మాస్మీ.. అర్థాన్ని తిరగరాసిన స్వామీజీ..!

Shantalingeshwara swamy faces ire from lord shiv devotees

shanti lingeshwara swamiji, feet, shiva lingam, rangana betta, Bangalore, swamiji, netzens, social media, viral news

shanta lingeshwara swamy faces ire from lord shiv devotees, who is known as mouna tapasvi, as he kept his feet on shiva lingam at rangana betta area in the suburban area of bangalore.

అహం బ్రహ్మాస్మీ.. అర్థాన్ని తిరగరాసిన స్వామీజీ..!

Posted: 11/09/2017 02:13 PM IST
Shantalingeshwara swamy faces ire from lord shiv devotees

పవిత్ర కార్తీకమాసంలో శివనామస్మరణ చేస్తే పునర్జన్మ లేకుండా పోతుందని భక్తుల అచెంచల విశ్వాసం. దీంతో ఏడాది పోడవునా ఆలయాలకు వెళ్లని భక్తులు కూడా కార్తీక మాసంలో శైవక్షేత్రాలతో పాటు వైష్ణవాలయాలకు తరలివెళ్లి అక్కడి భక్త శ్రధ్దలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక కార్తీకమాస వైశిష్ట్యం గురించి, పవిత్రత, ఫలాలు ఎలా వుంటాయన్న విషయాలను ఇప్పటికే అనేకానేక మంది పండితులు అనేక మాద్యమాల ద్వారా ప్రచరిచిస్తూ వుంటారు.

ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున తెల్లవారు స్యూరోదయానికి ముందుగానే లేచి స్నానాదులు అచరించి.. ఇంట్లోని తులసికోటలో ఉసరి కొమ్మను ఏర్పాటు చేసిన .. రోజుకక్కటి చోప్పున మొత్తంగా 365 ఒత్తులను వెలిగించి ఆ పరమేశ్వరుడ్ని చల్లగా చూడాలని కోరని భక్తులు వుండరు. అయితే భక్తుల అంచెలమైన విశ్వాసాలపై హైందవత్వానికి చెందిన ఓ స్వామీజీయే భక్తుల నమ్మకాలపై నీళ్లు చల్లే విధంగా వ్యవహరించారు. అదేమంటే వీరశైవ విధానమని తన శిష్యబృందంతో సెలవిప్పించారు.

కాగా స్వామీజీ చేసిన నిర్వాకంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతటి స్వామీజీ అయినా తాను దైవం కన్నా ఎక్కువ అని భావించరాదని, తానే దైవం అని కూడా భావించరాదని భక్తులు సూచిస్తున్నారు. ఇక స్వామీజీ చెప్పినట్లుగా ఏ విధానంలోనూ ఈ తరహాలో పూజలు నిర్వహించరని తేల్చచెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. కార్మీక పౌర్ణమి రోజున బెంగళూరు శివారులోని రంగనబెట్టి ప్రాంతంలో శాంతలింగేశ్వర స్వామికి చెందిన మఠం శాఖను నూతనంగా ప్రారంభించారు.

అయితే ఈ సందర్భంగా అక్కడి శివలింగాన్ని ఏర్పాటు చేసి.. ప్రాణప్రతిష్ట చేసే క్రమంలో సదరు స్వామీజీ  ఏకంగా శివలింగంపై పాదాలు మోపి తన శిష్యులతో పూజలు చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వామీజీ భక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అవి కాస్తా వైరల్ గా మారి స్వామీజీపై నెట్ జనులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం ఉగాది రోజున మాత్రమే మాట్లాడే స్వామీజి.. పూజలు తమ వీరశైవ విధానం ప్రకారమే జరిగాయని తన శిష్యులతో చెప్పించారు. అయినా నెట్ జనులు మాత్రం మండిపడుతూనే వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles