Untold Story of Baba Ramdev Must be Release | యోగా గురువుపై అలాంటి ఆరోపణలు.. ఆ బుక్ బయటకు వస్తుందా?

Allegations on baba ramdev

Godman to Tycoon, Priyanka Pathak, Baba Ramdev, Baba Ramdev Priyanka Pathak, Baba Ramdev Untold Story, Dark Shade of Baba Ramdev

Priyanka Pathak-Narain's Godman to Tycoon; The Untold Story of Baba Ramdev Should be release.

రాందేవ్ బాబాపై సంచలన ఆరోపణలు

Posted: 11/09/2017 12:54 PM IST
Allegations on baba ramdev

యోగా గురువు, పతంజలి బ్రాండ్ అంబాసిడర్ బాబా రాందేవ్ పై సంచలన ఆరోపణలకు సంబంధించిన ఓ పుసక్తం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’ అనే పుస్తకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దానిని మార్కెట్ లోకి రానివ్వకుండా ఆయన ఈ ఆగష్టులోనే కోర్టు స్టే తెచ్చుకున్నారు. అయితే జర్నలిస్ట్ ప్రియాంకా పాఠక్ రాసిన పుస్తకంలో ఇంతకు ఏముందో ఒక్కసారి చూద్దాం.

సాధారణ యోగా గురువుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన కోట్లకు ఎలా పడగనెత్తాడు. ఈ ప్రస్థానంలో ఆయన ఎదుర్కున్న అనుభవాలతోపాటు ఆయనకు అండగా నిలిచిన ఎంతో మంది అదృశ్యం కావటం మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె వారి మాయం వెనుక రాందేవ్ ఉన్నట్లు ఆరోపిస్తూ కథలు రాశారు.

- రాందేవ్‌ బాబాను చేరదీసి యోగా నేర్పి దివ్యమందిర్ ట్రస్ట్‌కి కోట్లాది రూపాయల విలువైన భూములిచ్చిన స్వామి శంకర్ దేవ్ 2007లో ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ కూడా శంకర్     దేవ్ అదృశ్యానికి గల కారణాన్ని కనిపెట్టలేక చేతులెత్తేసింది. దర్యాప్తు సమయంలో విదేశాల్లో ఉన్న బాబా రాందేవ్ విషయం తెలిసీ భారత్‌కు రాలేదు.
- రాందేవ్‌కు అత్యంత సన్నిహితుడైన స్వామి యోగానంద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయుర్వేద వైద్య నిష్ణాతుడైన యోగానంద్ ఇచ్చిన లైసెన్స్‌తోనే 1995 నుంచి 2003 వరకు రాందేవ్ పతంజలి             ఆయుర్వేద మందులు తయారుచేశారు. ఆ తర్వాత ఎందుకనో రాందేవ్ ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోగా.. ఆ తర్వాత ఏడాదికే యోగానంద్ హత్యకు గురయ్యారు.
- రాందేవ్ స్వదేశీ మిషన్‌కు ప్రణాళికలు వేసిన మరో స్నేహితుడు రాజీవ్ దీక్షిత్ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విభేదాల కారణంగా దివ్య మందిర్ ట్రస్ట్‌ డైరెక్టర్ మహారాజ్ కరమ్‌వీర్‌ 2005లో ట్రస్ట్ నుంచి     బయటకు వెళ్లిపోయారంటూ ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’ పుస్తకంలో రాశారు.

అయితే ఈ పుస్తకంలో చెప్పినవన్నీ కట్టుకథలేనని రాందేవ్ బాబా శిష్యులు చెబుతున్నారు. ప్రియాంకా మాత్రం ఆ పుస్తకాన్ని మార్కెట్ లోకి విడుదల చేసిన బాబా బండారాలను బయటపెడతానని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles